Share News

Chandrakant Pandit: కేకేఆర్‌ కోచ్‌కు ఉద్వాసన

ABN , Publish Date - Jul 30 , 2025 | 05:44 AM

చీఫ్‌ కోచ్‌ చంద్రకాంత్‌ పండిట్‌కు ఐపీఎల్‌ టీమ్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) ఉద్వాసన పలికింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన నేపథ్యంలో...

Chandrakant Pandit: కేకేఆర్‌ కోచ్‌కు ఉద్వాసన

న్యూఢిల్లీ: చీఫ్‌ కోచ్‌ చంద్రకాంత్‌ పండిట్‌కు ఐపీఎల్‌ టీమ్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) ఉద్వాసన పలికింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన నేపథ్యంలో సహాయ సిబ్బందిని ప్రక్షాళన చేయాలని కోల్‌కతా యాజమాన్యం నిర్ణయించింది. 2024లో పండిట్‌ హయాంలో కేకేఆర్‌ దశాబ్దం తర్వాత ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచింది. కానీ, ఆ తర్వాతి సీజన్‌లో ఘోర ప్రదర్శనతో కేవలం ఐదు విజయాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. మెకల్లమ్‌ స్థానంలో 2022లో కేకేఆర్‌ కోచ్‌గా చంద్రకాంత్‌ బాధ్యతలు చేపట్టాడు. పండిట్‌ కఠిన వ్యవహారశైలి కారణంగా కొందరు విదేశీ ప్లేయర్లు అసహనం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి..

ఇంగ్లండ్‌తో 4వ టెస్టు మ్యాచ్ టీమిండియా అద్భుత పోరాటం

సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 30 , 2025 | 05:44 AM