Share News

విజయంతో వీడ్కోలు

ABN , Publish Date - May 26 , 2025 | 05:16 AM

క్లాసెన్‌ (39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 105 నాటౌట్‌) విధ్వంసక శతకంతో.. ఐపీఎల్‌ చరిత్రలో మూడో అత్యధిక స్కోరు నమోదు చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఈ సీజన్‌ను ఘన విజయంతో ముగించింది...

 విజయంతో వీడ్కోలు

నేటి మ్యాచ్‌

పంజాబ్‌ X ముంబై

వేదిక : జైపూర్‌, రా.7.30 నుంచి

  • చివరి పోరులో సన్‌రైజర్స్‌ విజృంభణ

  • క్లాసెన్‌, హెడ్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌

  • 110 పరుగులతో కోల్‌కతా చిత్తు

క్లాసెన్‌ (39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 105 నాటౌట్‌)

లీగ్‌లో అత్యధిక స్కోర్లు..

  • 287/3 సన్‌రైజర్స్‌ (2024)

  • 286/6 సన్‌రైజర్స్‌ (2025)

  • 278/3 సన్‌రైజర్స్‌ (2025)

  • 277/3 సన్‌రైజర్స్‌ (2024)

న్యూఢిల్లీ: క్లాసెన్‌ (39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 105 నాటౌట్‌) విధ్వంసక శతకంతో.. ఐపీఎల్‌ చరిత్రలో మూడో అత్యధిక స్కోరు నమోదు చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఈ సీజన్‌ను ఘన విజయంతో ముగించింది. ఆదివారం జరిగిన తమ ఆఖరి, నామమాత్రపు మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 110 పరుగుల తేడాతో డిఫెండింగ్‌ చాంప్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. తొలుత సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 278/3 స్కోరు చేసింది. ట్రావిస్‌ హెడ్‌ (40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76) దూకుడైన హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. నరైన్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో కోల్‌కతా 18.4 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది. మనీష్‌ పాండే (37), హర్షిత్‌ రాణా (34), నరైన్‌ (31) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఉనాద్కట్‌, మలింగ, హర్ష్‌ దూబే తలో మూడు వికెట్లు పడగొట్టారు. క్లాసెన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.


బాదుడే.. బాదుడు..: ఆరంభంలో హెడ్‌.. ఆ తర్వాత క్లాసెన్‌ ఊచకోతతో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొన్న సన్‌రైజర్స్‌ కొండంత స్కోరు చేసింది. ఓపెనర్‌ అభిషేక్‌ (32)తో కలసి తొలి వికెట్‌కు 92 పరుగులు జోడించిన హెడ్‌.. క్లాసెన్‌తో కలసి రెండో వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యంతో భారీ స్కోరుకు బాటలు వేశాడు. ఆ తర్వాత క్లాసెన్‌, ఇషాన్‌ కిషన్‌ (29) మూడో వికెట్‌కు 36 బంతుల్లో 83 పరుగులు జతచేర్చి ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చారు. పవర్‌ప్లేలో హెడ్‌ శివాలెత్తడంతో స్కోరు బోర్డు రాకెట్‌ వేగంతో దూసుకెళ్లింది. ఆరు ఓవర్లకు సన్‌రైజర్స్‌ 79/0తో నిలిచింది. అయితే, ఏడో ఓవర్‌లో నరైన్‌ బౌలింగ్‌లో అభిషేక్‌ అవుటయ్యాడు. హెడ్‌కు తోడు క్లాసెన్‌ కూడా ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 8వ ఓవర్‌లోనే జట్టు స్కోరు సెంచరీ దాటింది. దూకుడుగా ఆడుతున్న హెడ్‌ను నరైన్‌ అవుట్‌ చేసినా.. జోరు తగ్గని క్లాసెన్‌ 15వ ఓవర్‌లో రెండు సిక్స్‌లతో స్కోరును 200 దాటించాడు. డెత్‌ ఓవర్లలో క్లాసెన్‌, ఇషాన్‌ కోల్‌కతా బౌలర్లకు చుక్కలు కనిపించాయి. అయితే కిషన్‌ను అరోరా అవుట్‌ చేశాడు. సెంచరీ పూర్తి చేసుకొన్న క్లాసెన్‌ బౌండ్రీతో టీమ్‌ స్కోరును 280 మార్క్‌కు చేరువ చేశాడు. 37 బంతుల్లో సెంచరీ పూర్తిచేసిన క్లాసెన్‌.. 2010 సీజన్‌లో ఇన్నే బంతుల్లో శతకబాదిన యూసుఫ్‌ పఠాన్‌ రికార్డును సమం చేశాడు. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ క్రిస్‌ గేల్‌ (30) పేరిట ఉంది.


స్కోరుబోర్డు

సన్‌రైజర్స్‌: అభిషేక్‌ (సి) రింకూ (బి) నరైన్‌ 32, హెడ్‌ (సి) రస్సెల్‌ (బి) నరైన్‌ 76, క్లాసెన్‌ (నాటౌట్‌) 105, ఇషాన్‌ (సి) నోకియా (బి) అరోరా 29, అనికేత్‌ (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు: 24; మొత్తం: 20 ఓవర్లలో 278/3; వికెట్ల పతనం: 1-92, 2-175, 3-258; బౌలింగ్‌: వైభవ్‌ 4-0-39-1, నోకియా 4-0-60-0, హర్షిత్‌ 3-0-40-0, నరైన్‌ 4-0-42-2, వరుణ్‌ 3-0-54-0, రస్సెల్‌ 2-0-34-0.

కోల్‌కతా: డికాక్‌ (సి) మనోహర్‌ (బి) మలింగ 9, నరైన్‌ (బి) ఉనాద్కట్‌ 31, రహానె (సి) అభిషేక్‌ (బి) ఉనాద్కట్‌ 15, రఘువంశి (సి) నితీశ్‌ (బి) మలింగ 14, రింకూ (సి) నితీశ్‌ (బి) హర్ష్‌ దూబే 9, రస్సెల్‌ (ఎల్బీ) హర్ష్‌ దూబే 0, మనీష్‌ పాండే (సి) మనోహర్‌ (బి) ఉనాద్కట్‌ 37, రమణ్‌దీప్‌ (బి) హర్ష్‌ దూబే 13, హర్షిత్‌ రాణా (సి అండ్‌ బి) మలింగ 34, వైభవ్‌ అరోరా (రనౌట్‌) 0, నోకియా (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 18.4 ఓవర్లలో 168 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-37, 2-55, 3-61, 4-70, 5-70, 6-95, 7-110, 8-162, 9-162, 10-168; బౌలింగ్‌: కమిన్స్‌ 2-0-25-0, ఉనాద్కట్‌ 4-0-24-3, హర్షల్‌ 2-0-21-0, మలింగ 3.4-0-31-3, హర్ష్‌ దూబే 4-0-34-3, నితీశ్‌ 1-0-6-0, అభిషేక్‌ శర్మ 2-0-25-0.


పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

గుజరాత్‌ 14 9 5 0 18 0.254

పంజాబ్‌ 13 8 4 1 17 0.327

బెంగళూరు 13 8 4 1 17 0.255

ముంబై 13 8 5 0 16 1.292

ఢిల్లీ 14 7 6 1 15 0.011

హైదరాబాద్‌ 14 6 7 1 13 -0.241

లఖ్‌నవూ 13 6 7 0 12 -0.337

కోల్‌కతా 14 5 7 2 12 -0.305

రాజస్థాన్‌ 14 4 10 0 8 -0.549

చెన్నై 14 4 10 0 8 -0.647

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

ఇవీ చదవండి:

డుప్లెసిస్ మామూలోడు కాదు!

జీటీ ఇక సర్దుకోవాల్సిందే!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

ఇవీ చదవండి:

డుప్లెసిస్ మామూలోడు కాదు!

జీటీ ఇక సర్దుకోవాల్సిందే!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 05:16 AM