Share News

Rishabh Pant: పంత్ రేంజ్ ఇదబ్బా.. అతడి ముందు రాహుల్ చేతులు జోడించి, శిరస్సు వంచి..

ABN , Publish Date - Jun 21 , 2025 | 12:51 PM

ఇంగ్లండ్‌తో టెస్టు తొలి రోజు చివరి ఓవర్లో కూడా పంత్ సిక్స్ బాదడం కేఎల్ రాహుల్‌ను ఆశ్చర్యపరిచింది. మ్యాచ్ అనంతరం పెవిలియన్‌కు వచ్చిన అతడికి రాహుల్ సరదాగా నమస్కరించాడు. వీపు తట్టి అభినందనలు తెలిపాడు.

Rishabh Pant: పంత్ రేంజ్ ఇదబ్బా..  అతడి ముందు రాహుల్ చేతులు జోడించి, శిరస్సు వంచి..
KL Rahul Rishabh Pant

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్, భారత్ టెస్టు మ్యాచ్ తొలి రోజు.. ఆట ముగింపు దశకు వచ్చేసింది. అప్పటికి భారత్ స్కోరు 351/3. అద్భుత స్థితిలో ఉంది. చివరి ఓవర్‌లో క్రీజులో పంత్ ఉన్నాడు. ఇలాంటి టైమ్‌లో సాధారణంగా ఎవరైనా ఒకటో రెండో సింగిల్స్ తీసి ఆటకు ముగింపు పలుకుతారు. లేదా డాట్ బాల్స్ ఆడి ఇక చాల్లే అని అనుకుంటారు. కానీ క్రీజ్‌లో ఉన్నది పంత్ కదా. అతడి దూకుడే కాస్త డిఫరెంట్.

క్రిస్ వోక్స్ వేసిన బంతికి పంత్ ముందు వచ్చి మరీ ఆడాడు. భారీ సిక్స్‌గా మలిచాడు. అలాంటి షాట్‌ను ఇంగ్లండ్ ప్లేయర్స్ ఎవర్వూ ఊహించలేదు. చివరి ఓవర్ సింపుల్‌గా ముగిసిపోతుందని అనుకున్నారు. కానీ పంత్ భారీ సిక్స్ కొట్టడంతో వోక్స్ షాక్‌లో చూస్తుండిపోయాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను కూడా ఇది ఆశ్చర్యపరిచింది. ఒక్కసారిగా పెద్ద పెట్టున నవ్వాడు. ఇక పంత్ దూకుడుకు ప్రత్యర్థులతో పాటు సొంత టీమ్ సభ్యులు కూడా సర్‌ప్రైజ్ అయ్యారు.


ఇక కేఎల్ రాహుల్ అయితే తన ఆశ్చర్యాన్ని అణుచుకోలేకపోయాడు. పంత్ పెవిలియన్‌కు వస్తుంటే చేతులు జోడించి నమస్కరిస్తూ అతడిని ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. ఈ సీన్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అయితే, ఏదో తొందరపాటుగా కాకుండా పంత్ పక్కా ప్లాన్‌తో చివరి ఓవర్‌లో సిక్స్ బాదాడు. కరెక్ట్‌గా సమయం చూసి బంతిని బౌండరీకి పంపించాడు.


ఇక ఈ మ్యాచ్‌లో అటు జైశ్వాల్, ఇటు శుభ్‌మన్ గిల్ కూడా అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో తొలి పర్యటనలోనే సెంచరీలు సాధించిన ఆటగాడిగా జైశ్వాల్ గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇక గిల్ కప్టెన్ బాధ్యతలు నిర్వహిస్తూనే బ్యాటింగ్‌లో కూడా రాణించాడు. 127 పరుగులో అజేయంగా నిలిచాడు. అయితే, చివర్లో పంత్ రావడం టీమిండియాకు కొత్త ఊపునిచ్చింది. పరుగుల వరదకు అడ్డుకట్ట పడుతుందని ఇంగ్లండ్ భావిస్తున్న తరుణంలో పంత్ మెరుపులు షాక్‌కు గురి చేశాయి.

ఇవీ చదవండి:

టీమిండియాపై సచిన్, గంగూలీల ప్రశంసలు.. మూడో సెంచరీ ఎవరిదంటూ ప్రశ్న

రెండేళ్ల తర్వాత పారిస్ డైమండ్ లీగ్ టైటిల్‌ గెల్చుకున్న నీరజ్ చోప్రా

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 21 , 2025 | 12:57 PM