లంకపై కివీస్ ఘన విజయం
ABN , Publish Date - Jan 06 , 2025 | 01:56 AM
మ్యాట్ హెన్రీ (4/19) నిప్పులు చెరగడంతోపాటు విల్ యంగ్ (90 నాటౌట్) అర్ధ శతకం సాధించడంతో శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం...

వెల్లింగ్టన్: మ్యాట్ హెన్రీ (4/19) నిప్పులు చెరగడంతోపాటు విల్ యంగ్ (90 నాటౌట్) అర్ధ శతకం సాధించడంతో శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత లంక 43.4 ఓవర్లలో 178 పరుగులకు కుప్పకూలింది. అవిష్క ఫెర్నాండో (56) హాఫ్ సెంచరీ చేశాడు. ఛేదనలో న్యూజిలాండ్ 26.2 ఓవర్లలో 180/1 స్కోరు చేసి గెలిచింది. రచిన్ రవీంద్ర (45) రాణించాడు. ఈ మూడు వన్డేల సిరీ్‌సలోని రెండో మ్యాచ్ బుధవారం జరుగుతుంది.