Share News

సెమీ్‌సపై కివీస్‌ కన్ను

ABN , Publish Date - Feb 24 , 2025 | 03:11 AM

తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్‌ ఆత్మవిశ్వాసంతో ఉరకలేస్తోంది. ఈనేపథ్యంలో గ్రూప్‌-ఎలో సోమవారం జరిగే పోరులో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది...

సెమీ్‌సపై కివీస్‌ కన్ను

చాంపియన్‌ ట్రోఫీ బంగ్లాతో మ్యాచ్‌ నేడు

మ.2.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

రావల్పిండి: తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్‌ ఆత్మవిశ్వాసంతో ఉరకలేస్తోంది. ఈనేపథ్యంలో గ్రూప్‌-ఎలో సోమవారం జరిగే పోరులో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సెమీఫైనల్‌ స్థానం దాదాపు ఖాయం చేసుకోవాలని కివీస్‌ పట్టుదలతో ఉంది. ముక్కోణపు టోర్నీ మ్యాచ్‌లో గాయపడిన రచిన్‌ రవీంద్ర కోలుకోవడంతో బంగ్లాతో పోరులో తుది జట్టు ఎంపిక న్యూజిలాండ్‌కు తలనొప్పిగా మారింది. వాస్తవంగా రచిన్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన యంగ్‌ను పక్కకు తప్పించాల్సి ఉంది. కానీ పాక్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌ యంగ్‌ సెంచరీతో సత్తా చాటాడు. పైగా స్పిన్నర్లను యంగ్‌ సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఒకవేళ రచిన్‌ కోసం అతడిని తప్పిస్తే..కుడి, ఎడమ కాంబినేషన్‌ దెబ్బతినే అవకాశం ఉంది. మరి న్యూజిలాండ్‌ యాజమాన్యం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరం. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఆరు వికెట్లతో భారత జట్టు చేతిలో ఓడిన బంగ్లాదేశ్‌కు న్యూజిలాండ్‌తో పోరు చావోరేవోనే.


ఈ మ్యాచ్‌లో నెగ్గి నాకౌట్‌ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే..బంగ్లా టాపార్డర్‌ బ్యాటర్లు శక్తికి మించి రాణించాల్సి ఉంటుంది. కాగా..గత చాంపియన్స్‌ ట్రోఫీలో కివీ్‌సను ఓడించిన బంగ్లాదేశ్‌ ఆ జట్టును టోర్నీ నుంచి నాకౌట్‌ చేసింది. ఆ ఒక్కటే సోమవారంనాటి మ్యాచ్‌కు బంగ్లాదేశ్‌కు స్ఫూర్తినిచ్చే అంశం.



మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 24 , 2025 | 03:11 AM