క్వార్టర్స్‌కు కిరణ్, సింధు
ABN , Publish Date - Jan 17 , 2025 | 05:29 AM
స్టార్ షట్లర్ పీవీ సింధు, యువ ఆటగాడు కిరణ్ జార్జ్ సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్‌లో అదరగొడుతున్నారు. సింగిల్స్‌లో వీరు క్వార్టర్‌ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఇక, పురుషుల డబుల్స్‌లో...

డబుల్స్‌లో సాత్విక్ జోడీ
ఇండియా ఓపెన్
న్యూఢిల్లీ: స్టార్ షట్లర్ పీవీ సింధు, యువ ఆటగాడు కిరణ్ జార్జ్ సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్‌లో అదరగొడుతున్నారు. సింగిల్స్‌లో వీరు క్వార్టర్‌ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఇక, పురుషుల డబుల్స్‌లో భారత ఏస్ జోడీ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ షెట్టి కూడా ప్రీక్వార్టర్స్‌ను అధిగమించారు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో సింధు 21-15, 21-13తో మనామి సుయిజు (జపా న్)ను చిత్తుచేయగా.. కిరణ్ 22-20, 21-13తో అలెక్స్ లేనియర్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. హోరాహోరీగా సాగిన పురుషుల డబుల్స్ పోరులో 2022 విజేత సాత్విక్/చిరాగ్ ద్వయం 20-22, 21-14, 21-16తో జపాన్ జంట మిత్సుహషి/ఒకమురను ఓడించింది. మహిళల డబుల్స్‌లో భారత జోడీ అశ్వినీ పొన్నప్ప/తనీషా 9-21, 21-23తో జపాన్ ద్వయం మత్సుమొటొ/ఫకషిమ చేతిలో, అశ్వినీ భట్/శిఖా గౌతమ్ జంట 7-21, 10-21తో చైనా జోడీ యాన్ లి/గ్జూ లూవో చేతిలో ఓడారు. క్వార్టర్స్‌లో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గ్రెగోరియాతో సింధు, హాంగ్ యాంగ్ (చైనా)తో కిరణ్ అమీతుమీ తేల్చుకోనున్నారు.