Share News

India vs England Lions: శతక్కొట్టిన కరుణ్‌ నాయర్‌

ABN , Publish Date - May 31 , 2025 | 03:11 AM

ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరుగుతున్న అనధికార టెస్ట్‌ మ్యాచ్‌లో కరుణ్‌ నాయర్‌ అద్భుతంగా 186 పరుగులు చేసి శతకాన్ని సాధించాడు. ఇండియా ‘ఎ’ 409/3తో తొలి రోజు ఆటను ముగించింది, సర్ఫరాజ్‌ ఖాన్‌ 92, ధ్రువ్‌ జూరెల్‌ 82 పరుగులతో నిలిచారు.

India vs England Lions: శతక్కొట్టిన కరుణ్‌ నాయర్‌

  • ఇండియా ‘ఎ’ 409/3

  • ఇంగ్లండ్‌ లయన్స్‌తో అనధికార టెస్ట్‌

కాంటర్‌బరీ: ఇంగ్లండ్‌ లయన్స్‌తో అనధికార టెస్ట్‌ తొలిరోజే కరుణ్‌ నాయర్‌ (186 బ్యాటింగ్‌) శతక్కొట్టాడు. శుక్రవారం ప్రారంభమైన ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో కరుణ్‌తోపాటు సర్ఫరాజ్‌ ఖాన్‌ (92), ధ్రువ్‌ జూరెల్‌ (82 బ్యాటింగ్‌) చెలరేగారు. దాంతో తొలి రోజు ఆఖరికి మొదటి ఇన్నింగ్స్‌లో ఇండియా ‘ఎ’ 409/3 పరుగులు చేసింది. టాస్‌ కోల్పోయి ఇండియా ‘ఎ’ బ్యాటింగ్‌ చేపట్టగా యశస్వీ జైస్వాల్‌ (24), అభిమన్యు ఈశ్వరన్‌ (8) విఫలమయ్యారు. ఆనక నాయర్‌, సర్ఫరాజ్‌ మూడో వికెట్‌కు 181 పరుగులు జోడించి ఆదుకున్నారు. తర్వాత జురెల్‌తో కలిసి కరుణ్‌ నాలుగో వికెట్‌కు అభేద్యంగా 177 పరుగులు జత చేశాడు.

Updated Date - May 31 , 2025 | 03:12 AM