సెంట్రల్ కాంట్రాక్ట్‌కు మళ్లీ నో చెప్పిన కేన్ విలియమ్సన్
ABN , Publish Date - Jun 04 , 2025 | 04:25 AM
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్‌ను ఆ దేశ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరోసారి తిరస్కరించాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌పై దృష్టిసారించిన...
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్‌ను ఆ దేశ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరోసారి తిరస్కరించాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌పై దృష్టిసారించిన విలియమ్సన్ గతేడాది కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ వద్దనుకొన్నాడు. కానీ, గత సంవత్సరం తరహాలోనే క్యాజువల్ కాంట్రాక్ట్‌పై అతడు సంతకం చేసే అవకాశాలున్నాయి. బోర్డు విడుదల చేసిన 20 మంది సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ల జాబితాలో కాన్వే, అలెన్, సీఫెర్డ్, ఫెర్గూసన్ పేర్లు కూడా లేవు. వీరంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ20 లీగ్‌లు ఆడుతున్న వారే. కాగా, మిడిల్‌సెక్స్ తరఫున కౌంటీలు ఆడుతున్న విలియమ్సన్.. ఆ తర్వాత ‘ద హండ్రెడ్’లో బరిలోకి దిగనున్నాడు.
ఇవీ చదవండి:
గుకేష్ ఎమోషనల్.. వీడియో చూడాల్సిందే!
బీసీసీఐ బాస్‌గా మాజీ జర్నలిస్ట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి