Jos Buttler Record: సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. చరిత్ర సృష్టించిన జాస్ బట్లర్
ABN , Publish Date - May 03 , 2025 | 09:42 AM
నిన్న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో జీటీ ప్లేయర్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 4 వేల పైచిలుకు పరుగులు మైలు రాయిని చేరుకున్న మూడో ఆటగాడిగా నిలిచాడు. తొలి స్థానంలో క్రిస్ గెయిల్, రెండో స్థానంలో ఏబీ డివిలియర్స్ ఉన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్‌లో నిన్న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో జీటీ బ్యాటర్ జాస్ బట్లర్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 4 వేల పైచిలుకు పరుగులు మైలు రాయిని చేరుకున్న మూడో ఆటగాడిగా నిలిచాడు. తొలి స్థానంలో క్రిస్ గెయిల్, రెండో స్థానంలో ఏబీ డివిలియర్స్ ఉన్నారు. ఈ మైలురాయిని చేరుకున్న తొలి ఇంగ్లిష్ ఆటగాడిగా కూడా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇన్నింగ్స్ ప్రకారం చూస్తే నాలుగో స్థానంలో నిలిచాడు. 105 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో 4 వేల పరుగుల మార్కును చేరుకుని కేఎల్ రాహుల్ తొలి స్థానంలో ఉన్నాడు. 112 ఇన్నింగ్స్‌తో క్రిస్ గెయిల్ రెండో స్థానంలో, 114 ఇన్నింగ్స్‌తో డేవిడ్ వార్నర్ మూడో స్థానంలో ఉండగా జాస్ బట్లర్ 116 ఇన్నింగ్స్‌లో 4 వేల పైచిలుకు పరుగులు చేసి నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ కేటగరిలోని టాప్ ఆటగాళ్లల్లో 40.52 యావరేజ్‌తో, 149.74 స్ట్రైక్ రేట్‌తో గొప్ప సగటు కలిగిన మూడో ఆటగాడిగా నిలిచారు.
ఇక హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన జాస్.. జీటీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 37 బంతుల్లో 64 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. గత నాలుగు ఇన్నింగ్స్‌లో జాస్ 40కి పైగా పరుగులు చేశాడు. మూడు అర్థశతకాలను కూడా సాధించాడు.
ఈ సీజన్‌లో ఆడిన 10 మ్యాచుల్లో ఏకంగా ఏడు ఓటములను మూటగట్టుకున్న హైదరాబాద్ సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు ఇక లేనట్టే. సాంకేతికంగా రేసులో ఉన్నా కూడా.. నాకౌట్‌కు చేరడం ఇక అసాధ్యమే. ప్రస్తుతం ప్లేఆఫ్స్ అవకాశాలు ఎంతో కొంత ఉన్న జట్టుల్లో హైదరాబాద్ అట్టడుగున ఉంది. సగటు రన్ రేట్ మైనస్ 1.192గా ఉంది. ముంబై ఇండియన్స్, బెంగళూరు, పంజాబ్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ అన్నీ లీగ్ దశను కనీసం 13 పాయింట్లతో ముగిస్తాయి.
ఇక సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కావాలంటే..
తదుపరి జరిగే అన్ని మ్యాచుల్లో భారీ మార్జిన్లతో గెలవాలి, నెట్ రన్ రేట్‌ను అసాధారణ స్థాయిలో మెరుగుపరుచుకోవాలి. హైదరాబాద్ కంటే మెరుగైన మూడు జట్టులు 14కు కంటే ఎక్కువ పాయింట్స్ లీగ్ దశను ముగించకూడదు. దీంతో, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప సన్‌రైజర్స్ నాకౌట్ దశకు చేరుకోవడం అసాధ్యమే
ఇవి కూడా చదవండి:
ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు
హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం
మరిన్ని క్రీడా వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి