పాక్ గడ్డపై ‘జనగణమన’!
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:04 AM
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో శనివారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ముందు....

ఆసీస్-ఇంగ్లండ్ మ్యాచ్‌లో భారత జాతీయ గీతం
ఐసీసీ వివరణ ఇవ్వాలంటూ పాక్ క్రికెట్ బోర్డు డిమాండ్
లాహోర్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో శనివారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ముందు అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు డీజే చేసిన చిన్న పొరపాటు వల్ల ఆస్ట్రేలియా జాతీయ గీతానికి బదులు భారత జాతీయ గీతం వినబడింది. తొలుత ఇంగ్లండ్ జాతీయ గీతాలాపన పూర్తయ్యాక.. ఆసీస్ ఆటగాళ్లు తమ గీతం కోసం సిద్ధమవగా, మైకులో నుంచి భారత జాతీయ గీతం మొదలైంది. దీంతో ఆటగాళ్లతోపాటు స్టేడియంలోని వారంతా విస్తుపోయారు. వెంటనే తేరుకున్న డీజే దానిని ఆపేసి, ఆస్ట్రేలియా జాతీయ గీతాన్ని పెట్టాడు. అయితే ఈ ఘటన ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా స్పందించింది.
ఈ ఉదంతంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. కాగా, ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్నప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు ఆ దేశానికి వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో భారత్ మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..