Share News

Italy Qualifies: ఇటలీకి టీ20 ప్రపంచకప్‌ బెర్త్‌

ABN , Publish Date - Jul 12 , 2025 | 02:50 AM

వచ్చే ఏడాది భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచక్‌పనకు మొదటిసారి ఇటలీ జట్టు అర్హత సాధించింది...

Italy Qualifies: ఇటలీకి టీ20 ప్రపంచకప్‌ బెర్త్‌

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచక్‌పనకు మొదటిసారి ఇటలీ జట్టు అర్హత సాధించింది. హేగ్‌ నగరంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇటలీపై నెదర్లాండ్స్‌ గెలిచింది. దీంతో నెదర్లాండ్స్‌ నేరుగా ప్రపంచకప్‌ బెర్త్‌ దక్కించుకుంది. అయితే, అంతకుముందు జెర్సీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ ఓటమి పాలైంది. దీంతో.. గత నాలుగు ఎడిషన్లలో టీ20 కప్‌లో తలపడిన స్కాట్లాండ్‌, ఈసారి అనూహ్యంగా టోర్నీకి దూరమవడం గమనార్హం. స్కాట్లాండ్‌ నిష్క్రమణతో.. జెర్సీ, ఇటలీ జట్లు చెరో ఐదు పాయింట్లతో సమంగా నిలిచాయి. కానీ, నెట్‌ రన్‌రేట్‌ పరంగా ముందంజలో నిలిచిన ఇటలీ మెగా టోర్నీలో ఆడేందుకు తొలిసారి చోటు దక్కించుకోగా.. జెర్సీ జట్టు రేసు నుంచి వెనుదిరిగింది.

Updated Date - Jul 12 , 2025 | 02:51 AM