కుటుంబమంతా ఇంతేనా..
ABN , Publish Date - Feb 24 , 2025 | 03:06 AM
ఓపెనర్ ఇమాముల్ హక్ రనౌట్ మరోసారి అతడి మామ ఇంజమాముల్ హక్‌ను గుర్తు చేసింది. 26 బంతులాడి క్రీజులో నిలదొక్కుకొనే ప్రయత్నం చేస్తున్న ఇమాముల్.. కుల్దీప్ బౌలింగ్‌లో...

ఓపెనర్ ఇమాముల్ హక్ రనౌట్ మరోసారి అతడి మామ ఇంజమాముల్ హక్‌ను గుర్తు చేసింది. 26 బంతులాడి క్రీజులో నిలదొక్కుకొనే ప్రయత్నం చేస్తున్న ఇమాముల్.. కుల్దీప్ బౌలింగ్‌లో సింగిల్ దొంగిలించే ప్రయత్నం చేశాడు. అయితే, మెరుపు వేగంతో బంతిని అందుకొన్న అక్షర్ డైరెక్ట్ త్రోతో రనౌట్ చేశాడు. హక్ డైవ్‌చేసినా.. క్రీజులోకి చేరుకోలేక పోయాడు. దీంతో కామెంటేటర్ రవిశాస్త్రి.. పాత విషయాలను గుర్తు చేసే విధంగా సరదాగా స్పందించాడు. ‘ఇది కుటుంబంలోనే ఉందా?’ అని పక్కనున్న అక్రమ్‌ను అడిగాడు. దీంతో అక్రమ్ చిరునవ్వు నవ్వి ఊరుకొన్నాడు. 90వ దశకంలో ఇంజమామ్ డేంజరస్ హిట్టర్ అయినా.. వికెట్ల మధ్య పరుగెత్తడం మాత్రం ఘోరంగా ఉండేది. తన కెరీర్‌లో 40సార్లు అతడు రనౌట్ అయ్యాడు. ఇప్పుడు ఇమామ్ కూడా అతడి అడుగుజాడల్లోనే నడుస్తున్నాడా? అనే విధంగా మీమ్స్ నెట్‌లో కనిపిస్తున్నాయి.
అఫ్రీది స్వార్థం..
అవుటైనట్టు స్పష్టంగా తెలుస్తున్నా.. కీలక రివ్యూను వ్యర్థం చేశాడని షహీన్ షా అఫ్రీదిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 43వ ఓవర్‌లో కుల్దీప్ బౌలింగ్‌లో అఫ్రీది వికెట్ల ముందు దొరికిపోయాడు. భారత ఆటగాళ్లు అప్పీలు చేయడంతో.. అంపైర్ మరో ఆలోచన లేకుండా అవుటిచ్చాడు. అయినా, అఫ్రీది ఏ మాత్రం ఆలోచించకుండా ఠక్కున రివ్యూకు వెళ్లాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..