Share News

నేటి నుంచి ఐపీఎల్‌ టిక్కెట్ల విక్రయం

ABN , Publish Date - Mar 07 , 2025 | 06:18 AM

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) జట్టు టిక్కెట్ల విక్రయా లను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించడంతో తెలుగు రాష్ట్రాల్లో...

నేటి నుంచి ఐపీఎల్‌ టిక్కెట్ల విక్రయం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) జట్టు టిక్కెట్ల విక్రయా లను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించడంతో తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎల్‌ సందడి మొదలైంది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి ‘జొమాటో డిస్ర్టిక్ట్‌’ యాప్‌లో టిక్కెట్లను అ మ్మకానికి ఉంచినట్టు ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం తెలిపింది. ఉప్పల్‌ స్టేడియంలో ఈనెల 23న సన్‌రైజర్స్‌-రాజస్థాన్‌, 27న సన్‌రైజర్స్‌-లఖ్‌నవూ జట్ల మధ్య జరిగే రెండు మ్యాచ్‌ల టిక్కెట్లను ఆన్‌లైన్‌లో మాత్రమే విక్రయించనున్నారు. ఆన్‌లైన్‌లో కొన్న టిక్కెట్లను ఏ కేంద్రాల్లో పొందా లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఇంకా ప్రకటించకపోవడంపై ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 07 , 2025 | 06:18 AM