Share News

రేసులో ఎవరెవరు

ABN , Publish Date - May 16 , 2025 | 05:47 AM

సీఎ్‌సకే, రాజస్థాన్‌, సన్‌రైజర్స్‌ మినహా మిగిలిన ఏడు జట్లు కూడా సాంకేతికంగా ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ రేసులో ఉన్నాయి. కానీ టాప్‌-4కు మెరుగైన అవకాశాలున్నాయి. ప్రస్తుతం పట్టికలో గుజరాత్‌, బెంగళూరు టాప్‌-2లో ఉండగా...

రేసులో ఎవరెవరు

సీఎ్‌సకే, రాజస్థాన్‌, సన్‌రైజర్స్‌ మినహా మిగిలిన ఏడు జట్లు కూడా సాంకేతికంగా ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ రేసులో ఉన్నాయి. కానీ టాప్‌-4కు మెరుగైన అవకాశాలున్నాయి. ప్రస్తుతం పట్టికలో గుజరాత్‌, బెంగళూరు టాప్‌-2లో ఉండగా.. వీరికి మరో విజయం చాలు. ఒకవేళ మిగిలిన మూడు మ్యాచ్‌లను గెలిస్తే కచ్చితంగా టాప్‌-2లో ముగిస్తారు. అలాగే మూడో స్థానంలో ఉన్న పంజాబ్‌ కూడా ఓ విజయం దూరంలోనే ఉంది. 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న ముంబై జట్టు డీసీ, పంజాబ్‌లపై కచ్చితంగా నెగ్గాల్సి ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ మిగిలిన మూడింటిని గెలిచాక కూడా ఇతర ఫలితాల కోసం చూడాల్సిందే. ఇక ఎల్‌ఎ్‌సజీ, కేకేఆర్‌ అన్ని మ్యాచ్‌లను గెలిచినా వారి ఖాతాలో 16, 15 పాయింట్లు మాత్రమే ఉంటాయి కాబట్టి ఆశలు వదులుకోవాల్సిందే.

ప్లేఆఫ్స్ కు దూరమయ్యే సఫారీలు వీరే..

రబాడ (గుజరాత్‌), మార్‌క్రమ్‌ (లఖ్‌నవూ), జాన్సెన్‌ (పంజాబ్‌), స్టబ్స్‌ (ఢిల్లీ), ఎన్‌గిడి (బెంగళూరు), ముల్డర్‌ (సన్‌రైజర్స్‌), రికెల్టన్‌, బోష్‌ (ముంబై).

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 16 , 2025 | 05:47 AM