Share News

IPL 2025: మాల్దీవులకు సన్‌రైజర్స్ టీమ్.. ఐపీఎల్ మధ్యలో ఎందుకంటే

ABN , Publish Date - Apr 26 , 2025 | 08:51 PM

గత సీజన్‌లో అద్భుతంగా రాణించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఈ ఏడాది మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వరుస పరాజయాలతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. శుక్రవారం చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది.

IPL 2025: మాల్దీవులకు సన్‌రైజర్స్ టీమ్.. ఐపీఎల్ మధ్యలో ఎందుకంటే
SRH Team

గత సీజన్‌లో అద్భుతంగా రాణించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమ్ ఈ ఏడాది మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది (IPL 2025). వరుస పరాజయాలతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. శుక్రవారం చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ఈ ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతవగా, సన్‌రైజర్స్ అవకావాలు మాత్రం ఇంకా సజీవంగా ఉన్నాయి. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ లీగ్ దశలో మిగిలిన 5 మ్యాచ్‌ల్లోనూ గెలవాలి.


ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని జట్టు లీగ్ దశలో 8 విజయాలు సాధించినట్లయితే 16 పాయింట్లు లభిస్తాయి. దాంతో టాప్-4లో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంది. అయితే అది ఇతర జట్ల విజయాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. వీటన్నింటినీ పక్కన పెట్టి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు సేద తీరేందుకు మాల్దీవులకు వెళ్లారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడాల్సిన తర్వాతి మ్యాచ్‌కు ముందు దాదాపు వారం రోజుల పాటు విశ్రాంతి దొరికింది. దీంతో సన్‌రైజర్స్ టీమ్ మాల్దీవులకు బయల్దేరింది. హైదరాబాద్ ఆటగాళ్లు విమానాశ్రయంలో ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 26 , 2025 | 08:51 PM