Share News

IPL 2025 SRH vs LSG: లఖ్‌నవూకు లాస్ట్ ఛాన్స్.. హైదరాబాద్‌పై గెలిచి నిలుస్తుందా

ABN , Publish Date - May 19 , 2025 | 04:47 PM

ఈ సీజన్‌లో టైటిల్ ఫేవరెట్లు అనుకున్న టీమ్‌లు. పేపర్ మీద ఆ జట్ల ఆటగాళ్ల పేర్లు చూస్తే బౌలర్లకు వణుకుపుట్టాల్సిందే. అయితే మైదానంలోకి దిగిన తర్వాత మాత్రం ఇరు జట్లు తేలిపోయాయి. గతేడాది రన్నరప్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ ఏడాది ప్లే ఆఫ్స్ రేసు నుంచి త్వరగా నిష్క్రమించింది.

IPL 2025 SRH vs LSG: లఖ్‌నవూకు లాస్ట్ ఛాన్స్.. హైదరాబాద్‌పై గెలిచి నిలుస్తుందా
LSG vs SRH

రెండూ బలమైన జట్లు. ఈ సీజన్‌లో (IPL 2025) టైటిల్ ఫేవరెట్లు అనుకున్న టీమ్‌లు. పేపర్ మీద ఆ జట్ల ఆటగాళ్ల పేర్లు చూస్తే బౌలర్లకు వణుకుపుట్టాల్సిందే. అయితే మైదానంలోకి దిగిన తర్వాత మాత్రం ఇరు జట్లు తేలిపోయాయి. గతేడాది రన్నరప్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఈ ఏడాది ప్లే ఆఫ్స్ రేసు నుంచి త్వరగా నిష్క్రమించింది. మరోవైపు టోర్నీ ఆరంభంలో మంచి విజయాలు సాధించిన లఖ్‌నవూ తర్వాత చేతులెత్తేసింది (LSG vs SRH).

LSG3.jpg


లఖ్‌నవూలోని ఏకనా స్టేడియంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ టీమ్ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే ఇక టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే. మరోవైపు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పరువు కోసం తలపడాల్సి ఉంది. ఇరు జట్లలోనూ బలమైన ఆటగాళ్లు ఉన్నారు. అయితే వారు ఫామ్‌లో లేకపోవడమే అసలు సమస్యగా మారింది.


ఐపీఎల్ చరిత్రలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటివరకు 5 సార్లు తలపడ్డాయి. వాటల్లో లఖ్‌నవూ నాలుగు సార్లు విజయం సాధించగా, సన్‌రైజర్స్ జట్టు కేవలం ఒక్కసారి మాత్రమే గెలుపొందింది. మరోవైపు ఈ రోజు మ్యాచ్ జరగబోయే ఏకనా స్టేడియంలో ఇరు జట్ల మధ్య జరిగిన ఒకే ఒక మ్యాచ్‌లో లఖ్‌నవూ గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 19 , 2025 | 04:47 PM