Sanju Samson-Rahul Dravid: రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ, కోచ్ ద్రవిడ్ మధ్య విభేదాలున్నాయా
ABN , Publish Date - Apr 18 , 2025 | 05:29 PM
టీమిండియా మాజీ కోచ్, ప్రస్తుత ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్ అయిన రాహుల్ ద్రవిడ్‌కు, ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్‌కు మధ్య విభేదాలున్నాయా? ఇటీవల ఢిల్లీతో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.
టీమిండియా మాజీ కోచ్, ప్రస్తుత ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్ అయిన రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)కు, ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson)కు మధ్య విభేదాలున్నాయా? ఇటీవల ఢిల్లీతో జరిగిన మ్యాచ్ (DC vs RR) సందర్భంగా ఆ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాలి గాయంతో బాధపడుతున్న ద్రవిడ్ వీల్ ఛైర్‌లో కూర్చుని రాజస్తాన్ రాయల్స్ టీమ్ మీటింగ్‌లకు, మ్యాచ్‌లకు, ప్రాక్టీస్ సెషన్‌కు హాజరవుతున్నాడు (IPL 2025).
ఈ సీజన్‌లో తొలి సూపర్ ఓవర్ రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ సూపర్ ఓవర్లో రాజస్తాన్‌పై ఢిల్లీ గెలుపొందింది. ఆ మ్యాచ్‌లో ఓపెనర్ అయిన సంజూ శాంసన్ పక్కటెముకల గాయంతో ఇబ్బంది పడి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. మ్యాచ్ టై అయిన తర్వాత సూపర్ ఓవర్‌కు ముందు డగౌట్‌లో రాజస్తాన్ రాయల్స్ మీటింగ్ జరిగింది. ఆటగాళ్లకు కోచ్ ద్రవిడ్ పలు సూచనలు చేశాడు. తన దగ్గరకు రమ్మని సంజూను ద్రవిడ్ ఆహ్వానించినా అతడు పట్టించుకోలేదు. ఆ మీటింగ్‌కు దూరంగా ఆటూ ఇటూ తిరిగాడు.
ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోపై క్రికెట్ అభిమానులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ద్రవిడ్‌కు, సంజూకు ఎప్పట్నుంచో పడడం లేదనుకుంటా. భారత జట్టులో ఉన్నప్పుడు అదే పరిస్థితి, సంజూ.. రాజస్తాన్ రాయల్స్ జట్టును వదిలియ్. చెన్నై టీమ్‌కు వచ్చెయ్, రాజస్తాన్ మేనేజ్‌మెంట్ సంజూను పట్టించుకోవడం లేదు, రాజస్తాన్ మేనేజ్‌మెంట్, కోచ్ సంజూ కంటే రియాన్ పరాగ్‌కే ఎక్కువ విలువ ఇస్తున్నట్టు కనిపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..