IPL 2025 RR vs GT: గుజరాత్ మళ్లీ టాప్ లేపుతుందా.. రాజస్తాన్ ఈసారైనా గెలుస్తుందా
ABN , Publish Date - Apr 28 , 2025 | 05:36 PM
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన ఆర్సీబీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానానికి చేరింది. అయితే ఆ ముచ్చట ఆర్సీబీకి ఒక్క రోజుకే పరిమితమవుతుందా? లేదా కొన్ని రోజులు టాప్‌లో ఉంటుందా అనేది ఈ రోజు గుజరాత్ టైటాన్స్ ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది.
చాలా రోజులుగా ఐపీఎల్ (IPL 2025) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంటూ వచ్చిన గుజరాత్ టైటాన్స్ (GT)కు తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) షాకిచ్చింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానానికి చేరింది. అయితే ఆ ముచ్చట ఆర్సీబీకి ఒక్క రోజుకే పరిమితమవుతుందా? లేదా కొన్ని రోజులు టాప్‌లో ఉంటుందా అనేది ఈ రోజు గుజరాత్ టైటాన్స్ ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. ఈ రోజు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో గుజరాత్ టైటాన్స్ తలపడబోతోంది (GT vs RR).

శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి ఆరు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరో రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే గుజరాత్ సునాయాసంగా ప్లే ఆఫ్స్‌కు చేరిపోతుంది. గుజరాత్ టైటాన్స్‌కు చెందిన సాయి సుదర్శన్ పరుగుల వేటలోనూ, ప్రసిద్ధ్ కృష్ణ వికెట్ల వేటలోనూ దూసుకుపోతున్నారు. మరోవైపు రాజస్తాన్ రాయల్స్ పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తోంది. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ముఖ్యంగా గత మూడు మ్యాచ్‌ల్లోనూ విజయానికి చేరువలోకి వచ్చి పరాజయం పాలైంది.
ఐపీఎల్ చరిత్రలో రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఇప్పటివరకు 7 సార్లు తలపడ్డాయి. అందులో ఆరు మ్యాచ్‌ల్లో గుజరాత్ టైటాన్స్‌దే విజయం. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే రాజస్తాన్ గెలవగలిగింది. ఇక, ఈ రోజు మ్యాచ్ జరగబోయే సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ రెండు జట్లు గతంలో రెండుసార్లు తలపడ్డాయి. ఆ రెండింట్లోనూ గుజరాత్‌దే విజయం. ఈ స్టేడియంలో ఇప్పటిరకు హై స్కోరింగ్ గేమ్‌లు జరగలేదు. ఈ మైదానంలో సగటు స్కోరు 160-180 మధ్యనే ఉంది. టాస్ గెలిస్తే ఈ పిచ్‌లో మొదటి బ్యాటింగ్ చేయడం సులభం అవుతుంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..