Share News

Rohit Sharma: అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్.. మరో 79 పరుగులు చేస్తే కోహ్లీ సరసకు హిట్‌మ్యాన్

ABN , Publish Date - May 06 , 2025 | 08:04 PM

టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఐపీఎల్‌లో మరో అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. మరో 79 పరుగులు చేస్తే కింగ్ కోహ్లీ సరసకు చేరుతాడు. కోహ్లీ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా నిలుస్తాడు. నిజానికి ఈ టోర్నీ ఆరంభంలో రోహిత్ శర్మ పరుగులు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

Rohit Sharma: అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్.. మరో 79 పరుగులు చేస్తే కోహ్లీ సరసకు హిట్‌మ్యాన్
Rohit Sharma, Virat Kohli

టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఐపీఎల్‌లో (IPL 2025) మరో అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. మరో 79 పరుగులు చేస్తే కింగ్ కోహ్లీ (Virat Kohli) సరసకు చేరుతాడు. కోహ్లీ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా నిలుస్తాడు. నిజానికి ఈ టోర్నీ ఆరంభంలో రోహిత్ శర్మ పరుగులు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. మొదటి ఆరు మ్యాచ్‌ల్లో కేవలం 82 పరుగులు మాత్రమే చేశాడు. అయితే చెన్నైతో మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి ఫామ్‌లోకి వచ్చాడు (Rohit Sharma Record).

rohit.jpg


గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడు అర్ధశతకాలు సాధించి ముంబై విజయంలో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఈ క్రమంలో మరో అరుదైన మైలురాయికి చేరువలోకి వచ్చాడు. రోహిత్ మరో 79 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో 79 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు. ఇంతకుముందు కోహ్లీ మాత్రమే ఆ ఘనత సాధించాడు. ఇప్పటికి 262 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ 6921 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు, 46 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తాజా సీజన్‌లో రోహిత్ పది మ్యాచ్‌లు ఆడి 32.55 సగటుతో 293 పరుగులు చేశాడు.


రోహిత్ మరో మూడు సిక్స్‌లు కొడితే ఐపీఎల్‌లో 300 సిక్స్‌లు కొట్టిన తొలి భారతీయుడిగా మారతాడు. అలాగే ఓవరాల్‌గా క్రిస్ గేల్ (357) తర్వాత అత్యధిక సిక్స్‌లు కొట్టిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు. గేల్ 141 ఇన్నింగ్స్‌లో 357 సిక్స్‌లు కొట్టాడు. రోహిత్ 262 ఇన్నింగ్స్‌ల్లో 297 సిక్స్‌లు బాదాడు. వీటిల్లో 17 సిక్స్‌లు తాజా సీజన్‌లోనే వచ్చాయి.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 06 , 2025 | 09:04 PM