IPL 2025 RCB vs RR: సంజూ శాంసన్ డౌటేనా.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే
ABN , Publish Date - Apr 24 , 2025 | 05:28 PM
రాజస్తాన్ రాయల్స్ జట్టు గెలవాల్సిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలై విమర్శలు ఎదుర్కొంటోంది. చివరి ఓవర్లో కేవలం 9 పరుగులు కొట్టలేక రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండే మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది.

రాజస్తాన్ రాయల్స్ జట్టు గెలవాల్సిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలై విమర్శలు ఎదుర్కొంటోంది. చివరి ఓవర్లో కేవలం 9 పరుగులు కొట్టలేక రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండే మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)ది ఓ విచిత్రమైన సమస్య. ఈ సీజన్లో ఆర్సీబీ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి ఐదింట్లో గెలిచింది. అయితే ఆ గెలిచిన ఐదు మ్యాచ్‌లు ప్రత్యర్థుల వేదికల్లో ఆడినవే. స్వంత మైదానం అయిన బెంగళూరులో ఆడిన మూడింట్లోనూ ఆర్సీబీ ఓటమి పాలైంది.
ఈ రోజు స్వంతమైదానం అయిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడుతోంది (RR vs RCB). ఈ మ్యాచ్‌లో విజయం సాధించి హోమ్ గ్రౌండ్లో కూడా సత్తా చాటాలని ఆర్సీబీ కృతనిశ్చయంతో ఉంది. ఎప్పటిలాగానే ఆర్సీబీకి విరాట్ కోహ్లీ కీలక బ్యాటర్. అలాగే రజత్ పటిదార్, పడిక్కళ్ కూడా రాణిస్తున్నారు. అయితే ఆర్సీబీని మిడిలార్డర్, చివర్లో ధాటిగా ఆడే బ్యాటర్లు లేకపోవడం అనే సమస్యలు వేధిస్తున్నాయి. టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా అంచనాల మేర రాణించలేకపోతున్నారు. అయితే హాజెల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యా, యశ్ దయాల్‌తో కూడిన బౌలింగ్ విభాగం మాత్రం పటిష్టంగా ఉంది.
సంజూ శాంసన్ అందుబాటులో లేకపోతే రియాన్ పరాగ్ ఆర్ఆర్ జట్టును నడిపిస్తాడు. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ మంచి ఆరంభాన్ని అందిస్తున్నారు. అయితే మిడిలార్డర్లో రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, నితీష్ రాణా రాణించలేకపోతున్నారు. గత సీజన్లో అద్భుతంగా రాణించిన ధ్రువ్ జురెల్ ఈ సీజన్లో పరుగులు చేయడానికి ఇబ్బందులు పడుతున్నాడు. చివరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సిన రెండు సందర్భాల్లోనూ క్రీజులో ధ్రువ్ జురెల్ ఉన్నాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యాడు. ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్, హసరంగా, తీక్షణతో కూడిన ఆర్ ఆర్ బౌలింగ్ విభాగం సమతూకంగా ఉంది.
తుది జట్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (అంచనా): విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కళ్, రజత్ పటిదార్, జితేష్ శర్మ, షెపర్డ్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జాష్ హాజెల్‌వుడ్, సుయాశ్ శర్మ
రాయల్ ఛాలెంజర్స్ (అంచనా): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్, నితీష్ రాణా, ధ్రువ్ జురెల్, హెట్మెయర్, హసరంగ, జోఫ్రా ఆర్చర్, తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..