Share News

IPL 2025, PBKS vs RR: టాస్ గెలిచిన పంజాబ్.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే

ABN , Publish Date - Apr 05 , 2025 | 07:10 PM

ఐపీఎల్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. పంజాబ్ హోమ్ గ్రౌండ్ అయిన మొహలీలో ఈ మ్యాచ్ జరగబోతోంది. ఈ సీజన్‌లో వరుస విజయాలతో ఓటమి లేకుండా దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్‌తో రాజస్తాన్ రాయల్స్ తలపడబోతోంది.

IPL 2025, PBKS vs RR: టాస్ గెలిచిన పంజాబ్.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే
PBKS vs RR

ఐపీఎల్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. పంజాబ్ హోమ్ గ్రౌండ్ అయిన మొహలీలో ఈ మ్యాచ్ జరగబోతోంది. ఈ సీజన్‌లో వరుస విజయాలతో ఓటమి లేకుండా దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్‌తో రాజస్తాన్ రాయల్స్ తలపడబోతోంది. ఈ సీజన్‌లో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించిన రాజస్తాన్ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో బలమైన పంజాబ్‌ను ఓడించి తన స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని రాజస్తాన్ కృత నిశ్చయంతో ఉంది.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రాజస్తాన్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. దీంతో ఆర్ఆర్ ఓపెనర్లు మైదానంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మ్యాచ్ నుంచి సంజూ శాంసన్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. మరి, సంజు అయినా రాజస్తాన్‌ను విజయాల బాట పట్టిస్తాడేమో చూడాలి. మరోవైపు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ పటిష్టంగా కనబడుతోంది.


తుది జట్లు:

రాజస్తాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హిట్‌మెయర్, హసరంగ, జ్రోఫా ఆర్చర్, మహీష్ తీక్షణ, యుద్ధ్‌‌వీర్ సింగ్, సందీప్ శర్మ

పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నేహల్ వధేరా, గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, శశాంక్ సింగ్, సూర్యాంశ్, మార్కో జాన్సన్, ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, చాహల్

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 05 , 2025 | 07:17 PM