IPL 2025, PBKS vs RR: జైస్వాల్ హాఫ్ సెంచరీ.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే
ABN , Publish Date - Apr 05 , 2025 | 09:13 PM
ఐపీఎల్‌లో మరో ఆసక్తికర మ్యాచ్ జరుగుతోంది. పంజాబ్ హోమ్ గ్రౌండ్ అయిన మొహలీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రాజస్తాన్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్ని అందించారు.

ఐపీఎల్‌లో మరో ఆసక్తికర మ్యాచ్ జరుగుతోంది. పంజాబ్ హోమ్ గ్రౌండ్ అయిన మొహలీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రాజస్తాన్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (67), రియాన్ పరాగ్ (43 నాటౌట్) రాణించడంతో భారీ స్కోరు సాధించింది. వీరిద్దరూ పంజాబ్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డారు. దీంతో రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.
ఓపెనర్ జైస్వాల్ (Yashasvi Jaiswal), సంజూ శాంసన్ (38) ఆరంభంలో నెమ్మెదిగా ఆడి ఆ తర్వాత గేర్లు మార్చారు. ముఖ్యంగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న జైస్వాల్ ఈ మ్యాచ్‌తో తిరిగి గాడిలో పడ్డాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించారు. వీరిద్దరినీ ఫెర్గూసన్ అవుట్ చేయడంతో పరుగుల వేగం తగ్గింది. ఆ తర్వాత వచ్చిన నితీష్ రాణా (12) కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. అయితే పరాగ్ కీలక ఇన్నింగ్స్ ఆడడంతో రాజస్తాన్ భారీ స్కోరు చేయగలిగింది. హెట్‌మేయర్ (20) కీలక పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో ఫెర్గూసన్ రెండు వికెట్లు తీశాడు. మార్కో జాన్సన్ ఒక వికెట్ తీశాడు.
మరి, ఈ సీజన్‌లో వరుస విజయాలతో ఓటమి లేకుండా దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే భారీ టార్గెట్‌ను ఛేదించాల్సిందే. ఈ సీజన్‌లో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించిన రాజస్తాన్ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. మరోవైపు పంజాబ్ టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ నేపథ్యంలో బలమైన పంజాబ్‌ను ఓడించి తన స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని రాజస్తాన్ కృత నిశ్చయంతో ఉంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..