IPL 2025 PBKS vs RR: పోరాడి ఓడిన రాజస్తాన్.. కీలక మ్యాచ్‌లో పంజాబ్ గెలుపు
ABN , Publish Date - May 18 , 2025 | 07:15 PM
పంజాబ్ కింగ్స్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటి కీలక మ్యాచ్‌లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న రాజస్తాన్ రాయల్స్ జట్టు పోరాడి ఓడిపోయింది.
పంజాబ్ కింగ్స్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటి కీలక మ్యాచ్‌లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న రాజస్తాన్ రాయల్స్ జట్టు పోరాడి ఓడిపోయింది. 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. రాజస్తాన్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సత్తా చాటారు. జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి (PBKS vs RR).
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రియాంశ్ ఆర్య (9), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (21), మిచెల్ ఓవెన్ (0) వెంటవెంటనే అవుటయ్యారు. ఆ దశలో నేహల్ వధేరా (70)తో కలిసి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (30) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 65 పరుగులకు పైగా జోడించారు.

శ్రేయస్ అవుటైన తర్వాత వచ్చిన శశాంక్ సింగ్ (59 నాటౌట్) కూడా కీలక పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్ భారీ స్కోరుకు బాటలు వేశాడు. చివర్లో ఒమర్జాయ్ (21) వేగంగా పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే 2 వికెట్లు తీశాడు. రియాన్ పరాగ్, మద్వాల్, క్వెనా మపాకా ఒక్కో వికెట్ తీశారు.
220 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు మెరుపు ఆరంభం లభించింది. యశస్వి జైస్వాల్ (25 బంతుల్లో 50) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (15 బంతుల్లో 40) మరోసారి సత్తా చాటాడు. అయితే వీరు అవుటైన తర్వాత పరిస్థితి పంజాబ్‌కు అనుకూలంగా మారింది. సంజూ శాంసన్ (20), రియాన్ పరాగ్ (13) విఫలమయ్యారు.
ధ్రువ్ జురెల్ (53) హాఫ్ సెంచరీ చేసి జట్టును విజయానికి చేరువగా తీసుకెళ్లాడు. అయితే మరో ఎండ్ నుంచి సహకారం లేకపోవడంతో గెలుపు దూరమైంది. చివరకు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. పంజాబ్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. యన్‌సెన్ రెండు వికెట్లు తీశాడు. రాజస్తాన్ ఇలా చివరి ఓవర్ వరకు పోరాడి ఓడిపోవడం ఈ సీజన్‌లో ఇది ఐదోసారి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..