Share News

IPL 2025 PBKS vs LSG: చితక్కొట్టిన ప్రభ్‌సిమ్రన్.. లఖ్‌నవూ ముందు భారీ టార్గెట్

ABN , Publish Date - May 04 , 2025 | 09:15 PM

యువ ఆటగాడు ప్రభ్‌సిమ్రన్ సింగ్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంతో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. ఫోర్లు, సిక్స్‌లతో హోరెత్తించి లఖ్‌నవూ బౌలర్లను ఉతికి ఆరేశాడు. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై బ్యాటర్లు చెలరేగడంతో లఖ్‌నవూ ముందు భారీ టార్గెట్ ఉంచింది.

IPL 2025 PBKS vs LSG: చితక్కొట్టిన ప్రభ్‌సిమ్రన్.. లఖ్‌నవూ ముందు భారీ టార్గెట్
PBKS vs LSG

యువ ఆటగాడు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (91) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంతో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. ఫోర్లు, సిక్స్‌లతో హోరెత్తించి లఖ్‌నవూ బౌలర్లను ఉతికి ఆరేశాడు. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై బ్యాటర్లు చెలరేగడంతో లఖ్‌నవూ ముందు భారీ టార్గెట్ ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి (PBKS vs LSG).

prabh.jpg


టాస్ గెలిచిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పంజాబ్ టీమ్ బ్యాటింగ్‌కు దిగింది. తొలి ఓవర్లనే ప్రియాంశ్ ఆర్యను అవుట్ చేసి ఆకాశ్ సింగ్ షాకిచ్చాడు. అయితే ఆ తర్వాత లఖ్‌నవూ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (48 బంతుల్లో 91) తన ఫామ్‌ను కొనసాగిస్తూ మరో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (45), జాస్ ఇంగ్లిస్ (30) సహకరించారు. చివర్లో శశాంక్ సింగ్ (33 నాటౌట్) కీలక పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది.


లఖ్‌నవూ బౌలర్లలో ఆకాశ్ సింగ్, దిగ్వేష్ రాఠీ రెండేసి వికెట్లు తీశారు. ప్రిన్స్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను మెరుగుపరుచుకోవాలంటే లఖ్‌నవూ 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సిందే. ఈ ఛేజింగ్‌లో ఓపెనర్లు మార్‌క్రమ్, మిచెల్ మార్ష్‌తో పాటు నికోలస్ పూరన్ అత్యంత కీలకం కాబోతున్నారు. మరి, బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై వీరు ఎలా రాణిస్తారో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 04 , 2025 | 09:15 PM