Share News

Yuzvendra Chahal: ఛాహల్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన.. ఎన్ని రికార్డులు సృష్టించాడంటే

ABN , Publish Date - Apr 16 , 2025 | 05:36 PM

యుజ్వేంద్ర ఛాహల్ మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన జట్టు పంజాబ్ కింగ్స్‌ను గెలిపించాడు. ఒక దశలో 62/2తో పటిష్టంగా కనిపించిన కేకేఆర్ 95 పరుగులకు ఆలౌట్ అయి పరాజయం పాలవడంలో ఛాహల్‌ది కీలక పాత్ర అని చెప్పక తప్పదు.

Yuzvendra Chahal: ఛాహల్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన.. ఎన్ని రికార్డులు సృష్టించాడంటే
Yuzvendra Chahal

ఇటీవలి కాలంలో ఎక్కువగా వ్యక్తిగత వివాదాలతోనే వార్తల్లో నిలిచిన టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర ఛాహల్ (Yuzvendra Chahal) తాజాగా తన అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన జట్టు పంజాబ్ కింగ్స్‌ను గెలిపించాడు (PBKS vs KKR). ఒక దశలో 62/2తో పటిష్టంగా కనిపించిన కేకేఆర్ 95 పరుగులకు ఆలౌట్ అయి పరాజయం పాలవడంలో ఛాహల్‌ది కీలక పాత్ర అని చెప్పక తప్పదు (Yuzvendra Chahal Records).


నిలకడగా ఆడుతూ తమ జట్టును విజయం వైపు తీసుకెళ్తున్న అజింక్య రహానే, రఘువంశీలను పెవిలియన్ చేర్చిన ఛాహల్.. ఆ తర్వాత రింకూ సింగ్, రమణ్ దీప్‌లను కూడా అవుట్ చేశాడు. ఈ క్రమంలో పలు రికార్డులను సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయడం ఛాహల్‌కు ఇది ఎనిమిదో సారి. ఇంతకు ముందు కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. అలాగే కేకేఆర్‌పై ఒక మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయడం ఛాహల్‌కు ఇది మూడోసారి.


ఇక, కేకేఆర్‌పై ఛాహల్ ఇప్పటివరకు 33 వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో కేకేఆర్‌పై ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఇక, ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్ కూడా ఛాహల్. ఐపీఎల్‌లో ఛాహల్ ఇప్పటివరకు 207 వికెట్లు తీసి టాప్‌లో ఉన్నాడు. ఇక, టీ-20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో ఛాహల్‌ది 11వ స్థానం. ఛాహల్ 318 మ్యాచ్‌ల్లో 370 వికెట్లు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో అఫ్గాన్ బౌలర్ రషీద్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. రషీద్ ఖాన్ 468 మ్యాచ్‌ల్లో 638 వికెట్లు తీశాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోెసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 16 , 2025 | 05:36 PM