Share News

IPL 2025 PBKS vs DC: స్టేడియంలో ఫ్లడ్‌లైట్స్ సమస్య.. ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్ రద్దు

ABN , Publish Date - May 08 , 2025 | 10:32 PM

ధర్మశాల వేదికగా జరుగుతున్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ రద్దయింది (IPL 2025) స్టేడియంలో అమర్చిన ఫ్లడ్‌లైట్లలో సమస్య కారణంగా ఈ మ్యాచ‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. స్టేడియం ఉన్న ప్రాంతంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం తలెత్తింది.

IPL 2025 PBKS vs DC: స్టేడియంలో ఫ్లడ్‌లైట్స్ సమస్య.. ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్ రద్దు
PBKS vs DC

ధర్మశాల వేదికగా జరుగుతున్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ రద్దయింది (IPL 2025) స్టేడియంలో అమర్చిన ఫ్లడ్‌లైట్లలో సమస్య కారణంగా ఈ మ్యాచ‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. స్టేడియం ఉన్న ప్రాంతంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం తలెత్తింది. దీంతో సరఫరా లేక ఫ్లడ్‌లైట్లు ఆగిపోయింది. దీంతో మ్యాచ్‌ను అర్ధంతరంగా ఆపేశారు. దీంతో ప్రేక్షకులకు కలిగిన ఆసౌకర్యానికి బీసీసీఐ క్షమాపణలు చెప్పింది.


టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఢిల్లీ టీమ్ బౌలింగ్‌కు ప్రారంభించింది. 10 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 122 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (70), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (50 నాటౌట్) అర్ధశతకాలు సాధించారు. ఈ మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 08 , 2025 | 10:32 PM