IPL 2025 PBKS vs DC: ధర్మశాలలో బీసీసీఐ ప్రత్యేక కార్యక్రమం.. సైన్యానికి మద్దతుగా
ABN , Publish Date - May 08 , 2025 | 06:35 PM
పాకిస్తాన్‌పై దాడి నేపథ్యంలో ఈ మ్యాచ్ జరుగుతుందా, లేదా అనే అనుమానం నెలకొంది (IPL 2025). అయితే ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత సైన్యానికి మద్దతుగా నిలవాలనే సంకల్పంతో బీసీసీఐ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది (DC vs PBKS). పాకిస్తాన్‌పై దాడి నేపథ్యంలో ఈ మ్యాచ్ జరుగుతుందా, లేదా అనే అనుమానం నెలకొంది (IPL 2025). అయితే ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత సైన్యానికి మద్దతుగా నిలవాలనే సంకల్పంతో బీసీసీఐ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
ఆపరేషన్ సిందూర్ పేరిట భారత సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. ఉగ్రమూకల నిర్మూలనలో సైన్యం చూపిన తెగువను కీర్తిస్తూ వారికి సంఘీభావం తెలిపేందుకు బీసీసీఐ నడుం బిగించింది. అందుకోసం ఈ రోజు మ్యాచ్ సమయంలో ధర్మశాలలో ఓ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రముఖ గాయకుడు బి ప్రాక్ (పత్రీక్ బచన్) ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమంలో బి ప్రాక్ భారత సైనికులను ఉద్దేశిస్తూ గౌరవ సూచికంగా దేశభక్తి గీతాలను ఆలపించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు కూడా పాల్గొనబోతున్నారు. అలాగే బుధవారం ఈడెన్ గార్డెన్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లు, సిబ్బంది భారత సైన్యానికి మద్దతుగా జాతీయ గీతాలాపన చేశారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..