Share News

IPL 2025 PBKS: గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ నుంచి అవుట్.. అతడి స్థానంలో ఎవరు వచ్చారంటే

ABN , Publish Date - May 04 , 2025 | 08:46 PM

పంజాబ్ కింగ్స్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ తాజా ఐపీఎల్ సీజన్‌ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. చేతి వేలి గాయం కారణంగా మ్యాక్స్‌వెల్ జట్టు నుంచి వైదొలిగాడు. దీంతో అతడి స్థానంలో పంజాబ్ కింగ్స్ మరో ఆటగాడిని తీసుకుంది. మ్యాక్స్‌వెల్ స్థానంలో ఆస్ట్రేలియాకే చెందిన మిచెల్ ఓవెన్‌ను పంజాబ్ తీసుకుంది.

IPL 2025 PBKS: గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ నుంచి అవుట్.. అతడి స్థానంలో ఎవరు వచ్చారంటే
Mitch Owen to replace injured Glenn Maxwell

పంజాబ్ కింగ్స్ (PBKS) ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) తాజా ఐపీఎల్ (IPL 2025) సీజన్‌ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. చేతి వేలి గాయం కారణంగా మ్యాక్స్‌వెల్ జట్టు నుంచి వైదొలిగాడు. దీంతో అతడి స్థానంలో పంజాబ్ కింగ్స్ మరో ఆటగాడిని తీసుకుంది. మ్యాక్స్‌వెల్ స్థానంలో ఆస్ట్రేలియాకే చెందిన మిచెల్ ఓవెన్‌ను (Mitchell Owen) పంజాబ్ తీసుకుంది. ఇటీవలి బిగ్‌బాష్ లీగ్‌లో మిచెల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.


బిగ్‌బాష్ లీగ్‌లో మిచెల్ 200 స్ట్రైక్‌రేట్‌తో 452 పరుగులు చేశాడు. ప్రస్తుతం మిచెల్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీ జట్టుకు ఆడుతున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న అతడని పంజాబ్ కింగ్స్ తీసుకుంది. మ్యాక్స్‌వెల్ ధర అయిన రూ.3 కోట్లకే మిచెల్‌ను కూడా పంజాబ్ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ కమిటీ ఓ ప్రకటన ద్వారా తెలిపింది.


మిచెల్ బ్యాటర్ మాత్రమే కాదు.. బౌలింగ్ కూడా వేయగల ఆల్‌రౌండర్. ఇప్పటివరకు మొత్తం 34 టీ-20లు ఆడిన మిచెల్ 646 పరుగులు చేశాడు. అలాగే పది వికెట్లు కూడా తీశాడు. త్వరలోనే పంజాబ్ టీమ్‌తో మిచెల్ జాయిన్ కాబోతున్నాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 04 , 2025 | 08:46 PM