Share News

IPL 2025, MI vs RCB: చితక్కొట్టిన రజత్, కోహ్లీ.. ముంబై టార్గెట్ ఎంతంటే

ABN , Publish Date - Apr 07 , 2025 | 09:14 PM

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు చెలరేగారు. కింగ్ కోహ్లీ (42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 67) తనదైన ఇన్నింగ్స్ ఆడి బెంగళూరు భారీ స్కోరుకు బాటలు వేశాడు. బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత కెప్టెన్ రజత్ పటిదార్ ముంబై బౌలర్లను ఉతికి ఆరేశాడు.

IPL 2025, MI vs RCB: చితక్కొట్టిన రజత్, కోహ్లీ.. ముంబై టార్గెట్ ఎంతంటే
Virat Kohli

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు చెలరేగారు. కింగ్ కోహ్లీ (42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 67) తనదైన ఇన్నింగ్స్ ఆడి బెంగళూరు భారీ స్కోరుకు బాటలు వేశాడు. బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత కెప్టెన్ రజత్ పటిదార్ (32 బంతుల్లో 64) ముంబై బౌలర్లను ఉతికి ఆరేశాడు. దీంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. పిచ్ నుంచి సహకారం లభించకపోవడంతో ముంబై బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.


టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆర్సీబీ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ తొలి ఓవర్లోనే బౌల్ట్ బౌలింగ్‌లో అవుటై వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన దేవదత్ పడిక్కళ్ (37) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జోరు మీదున్న పడిక్కళ్‌ను విఘ్నేష్ పుత్తుర్ అవుట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రజత్ పటిదార్ కూడా తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. కోహ్లీని, లివింగ్‌స్టన్‌ను వెంట వెంటనే అవుట్ చేసిన హార్దిక్ పాండ్యా ముంబై జోరుకు బ్రేకులు వేశాడు.


వికెట్లు పడినా పటిదార్ మాత్రం వేగం తగ్గించలేదు. మరోవైపు జితేష్ (40) కూడా కీలక పరుగులు చేశాడు. దీంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా, బౌల్ట్ రెండేసి వికెట్లు పడగొట్టారు. విఘ్నేష్ పుత్తుర్ ఒక్కో వికెట్ పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా తప్ప మిగిలిన బౌలర్లందరూ ఓవర్‌కు 10కి పైగానే పరుగులు సమర్పించుకున్నారు. మరి, ఈ భారీ స్కోరును ముంబై బ్యాటర్లు ఛేదించగలరో, లేదో చూద్దాం.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 07 , 2025 | 10:43 PM