Share News

Suryakumar Yadav: సూర్య ప్రతాపం.. ఐపీఎల్‌లో స్కై మరో అరుదైన మైలురాయి

ABN , Publish Date - Apr 27 , 2025 | 06:40 PM

టోర్నీ ఆరంభంలో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం అదిరే ఆటతో అదరగొడుతున్నాడు. వరుస హాఫ్ సెంచరీలతో ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Suryakumar Yadav: సూర్య ప్రతాపం.. ఐపీఎల్‌లో స్కై మరో అరుదైన మైలురాయి
Suryakumar Yadav

టోర్నీ (IPL 2025) ఆరంభంలో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ప్రస్తుతం అదిరే ఆటతో అదరగొడుతున్నాడు. వరుస హాఫ్ సెంచరీలతో ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ (MI vs LSG) సూర్య అర్ధశతకం సాధించాడు. 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 54 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ క్రమంలో కొన్ని మైలు రాళ్లను చేరుకున్నాడు.

surya.jpg


ఐపీఎల్‌లో సూర్య 4 వేల పరుగుల మైలు రాయిని చేరుకున్నాడు. ఆవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 4000 పరుగులను దాటాడు. అలాగే రవి బిష్ణోయ్ బౌలింగ్‌‌లో కొట్టిన సిక్స్‌తో ఐపీఎల్‌లో 150 సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా కూడా నిలిచాడు. 54 పరుగులు చేసిన అనంతరం 18వ ఓవర్లో ఆవేష్ ఖాన్ బౌలింగ్‌లో అవుటై పెవిలియన్ చేరాడు. వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రిషభ్ పంత్‌ అంచనాలను తల్లకిందులు చేస్తూ ముంబై బ్యాటర్లు చెలరేగారు.


ముంబై ఓపెనర్ రికెల్టన్ కళ్లు చెదిరే హఫ్ సెంచరీతో మెరుపు ఆరంభం అందించాడు. ఆ తర్వాత మిడిలార్డర్‌లో సూర్య కుమార్ యాదవ్ కూడా అద్భుతమైన అర్ధశతకం సాధించాడు. దీంతో ముంబై టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. ప్రస్తుతం లఖ్‌నవూ ఛేజింగ్ చేస్తోంది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 27 , 2025 | 06:40 PM