IPL 2025 MI vs LSG: ముంబైను ఆపేదెవరు.. వరుసగా ఐదో విజయం.. పంత్ సేనకు పరాభవం
ABN , Publish Date - Apr 27 , 2025 | 07:27 PM
టోర్నీఆరంభంలో ఇబ్బంది పడిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత అద్భుతంగా కోలుకుంది. ప్రస్తుతం అదిరే ఆటతో అదరగొడుతూ వరుసగా ఐదో విజయాన్ని అందుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది.
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ టీమ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. టోర్నీ (IPL 2025) ఆరంభంలో ఇబ్బంది పడిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత అద్భుతంగా కోలుకుంది. ప్రస్తుతం అదిరే ఆటతో అదరగొడుతూ వరుసగా ఐదో విజయాన్ని అందుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (MI vs LSG) 54 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్, రికెల్టన్ రాణించగా, బౌలింగ్‌లో బుమ్రా మెరిశాడు.

వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రిషభ్ పంత్ అంచనాలను తల్లకిందులు చేస్తూ ముంబై బ్యాటర్లు చెలరేగారు. ముంబై ఓపెనర్ రికెల్టన్ (58) కళ్లు చెదిరే హఫ్ సెంచరీతో మెరుపు ఆరంభం అందించాడు. ఆ తర్వాత మిడిలార్డర్‌లో సూర్య కుమార్ యాదవ్ (54) కూడా అద్భుతమైన అర్ధశతకం సాధించాడు. దీంతో ముంబై టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది.లఖ్‌నవూ బౌలర్లలో మయాంక్ యాదవ్, ఆవేష్ ఖాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
216 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న మార్‌క్రమ్ (9) 3వ ఓవర్లోనే అవుటయ్యాడు. ఆ తర్వాత లఖ్‌నవూ టీమ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి ఏ దశలోనూ విజయం వైపు వెళ్లలేదు. ఆయుష్ బదోనీ (35), మిచెల్ మార్ష్ (34) మాత్రమే చెప్పుకోదగిన స్కోరు చేశారు. జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లతో లఖ్‌నవూ పతనాన్ని శాసించాడు. దీంతో లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌట్ అయింది. 54 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..