IPL 2025 MI vs GT: టాప్ ఫైట్.. గెలిచిన జట్టు అగ్రస్థానానికి
ABN , Publish Date - May 06 , 2025 | 05:41 PM
టోర్నమెంట్‌లో రెండు ఉత్తమ జట్లు తలపడుతున్నాయి. అగ్రస్థానానికి చేరుకునేందుకు పోరాడబోతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది.
ఐపీఎల్ (IPL 2025)లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. టోర్నమెంట్‌లో రెండు ఉత్తమ జట్లు తలపడుతున్నాయి. అగ్రస్థానానికి చేరుకునేందుకు పోరాడబోతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది (GT vs MI). ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. ముంబై ఇండియన్స్ జట్టుకు గత ఆరు మ్యాచ్‌ల్లో పరాజయం అనేదే లేదు.

గుజరాత్ టైటాన్స్ జట్టు గత ఐదు మ్యాచ్‌ల్లో రెండింట్లో ఓడిపోయింది. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓడించి తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఈ రోజు ముంబైతో పోరుకు సిద్ధమవుతోంది. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఇప్పటివరకు ఆరు సార్లు తలపడ్డాయి. అందులో ముంబై ఇండియన్స్ రెండు సార్లు గెలవగా, గుజరాత్ టైటాన్స్ నాలుగు విజయాలు సాధించింది. ప్రస్తుత సీజన్‌లో రెండు జట్లు వరుస విజయాలతో టాప్ ఫోర్‌లో కొనసాగుతున్నాయి.
ఈ ఆసక్తికర మ్యాచ్ జరుగుతున్న ముంబైలో మంగళవారం సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అయితే భారీ వర్షం కాకుండా మ్యాచ్‌కు అంతరాయం కలిగించే స్థాయిలో చినుకులు పడవచ్చని పేర్కొంది. సోమవారం హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం వల్ల ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ రద్దైన సంగతి తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..