Share News

IPL 2025 MI vs GT: టాస్ గెలిచిన గుజరాత్.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే

ABN , Publish Date - May 06 , 2025 | 07:04 PM

కీలకమైన ప్లే ఆఫ్స్ కోసం పోరు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది.

IPL 2025 MI vs GT: టాస్ గెలిచిన గుజరాత్.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే
GT vs MI

ఐపీఎల్‌ (IPL 2025)లో కీలకమైన ప్లే ఆఫ్స్ కోసం పోరు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది (GT vs MI). ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. ముంబై ఇండియన్స్ జట్టుకు గత ఆరు మ్యాచ్‌ల్లో పరాజయం అనేదే లేదు. గుజరాత్ టైటాన్స్ జట్టు గత ఐదు మ్యాచ్‌ల్లో రెండింట్లో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో కీలక మ్యాచ్ జరగబోతోంది.


టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముంబై టీమ్ బ్యాటింగ్‌కు రెడీ అవుతోంది. ముంబైలో మంగళవారం సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అయితే భారీ వర్షం కాకుండా మ్యాచ్‌కు అంతరాయం కలిగించే స్థాయిలో చినుకులు పడవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో చూడాలి.


తుది జట్లు:

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, బాష్, దీపక్ ఛాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా

గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, జాస్ బట్లర్, అర్షద్ ఖాన్, రాహుల్ తెవాటియా, షారూక్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిశోర్, కోయేట్జ్, ప్రసిద్ద్ కృష్ణ, సిరాజ్

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 06 , 2025 | 07:04 PM