IPL 2025 MI vs GT: వాంఖడేలో ముంబై తడబాటు.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే
ABN , Publish Date - May 06 , 2025 | 09:24 PM
ఐపీఎల్‌లో కీలకమైన ప్లే ఆఫ్స్ కోసం జరుగుతున్న పోరులో ముంబై ఇండియన్స్ జట్టు తడబడింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై టీమ్ బ్యాటర్లు తడబడ్డారు.
ఐపీఎల్ (IPL 2025)లో కీలకమైన ప్లే ఆఫ్స్ కోసం జరుగుతున్న పోరులో ముంబై ఇండియన్స్ జట్టు తడబడింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది (GT vs MI). ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై టీమ్ బ్యాటర్లు తడబడ్డారు. విల్ జాక్స్ (53) అర్ధశతకంతో ఆదుకోవడంతో ముంబై టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 155 పరుగులు చేసింది.

టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముంబై టీమ్ బ్యాటింగ్‌కు దిగింది. తొలి ఓవర్లోనే సిరాజ్ బౌలింగ్‌లో రికెల్టన్ (2) అవుటయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే రోహిత్ శర్మ (7) కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత విల్ జాక్స్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ (35) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. అయితే వీరి భాగస్వామ్యాన్ని సాయి కిశోర్ అవుట్ చేశాడు. ఆ తర్వాత ముంబై వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది.
చివర్లో నమన్ ధీర్ కీలక పరుగులు చేశాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. గుజరాత్ ముందు 156 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. మరి, బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఈ లక్ష్యాన్ని గుజరాత్ ఎలా ఛేదిస్తుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..