Share News

Rishabh Pant: రిషభ్ పంత్‌కు ఏమైంది.. ఎందుకలా ఆడుతున్నాడు.. మాజీ క్రికెటర్లు ఏమంటున్నారంటే

ABN , Publish Date - May 05 , 2025 | 06:48 PM

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ పంత్‌ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. లఖ్‌నవూ టీమ్ సారథ్యం కూడా అప్పగించింది. అయితే ఆ ప్రైస్‌ట్యాగ్ ఒత్తిడి వల్లనో ఏమో పంత్ వరుసగా విఫలమవుతున్నాడు. అటు జట్టును కూడా విజయపథంలో నడిపించలేకపోతున్నాడు.

Rishabh Pant: రిషభ్ పంత్‌కు ఏమైంది.. ఎందుకలా ఆడుతున్నాడు.. మాజీ క్రికెటర్లు ఏమంటున్నారంటే
Rishabh Pant

ఐపీఎల్ (IPL 2025) చరిత్రలో అత్యధిక ప్రైస్ ట్యాగ్ పొందిన ఆటగాడు రిషభ్ పంత్ (Rishabh Pant). లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) పంత్‌ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. లఖ్‌నవూ టీమ్ సారథ్యం కూడా అప్పగించింది. అయితే ఆ ప్రైస్‌ట్యాగ్ ఒత్తిడి వల్లనో ఏమో పంత్ వరుసగా విఫలమవుతున్నాడు. అటు జట్టును కూడా విజయపథంలో నడిపించలేకపోతున్నాడు. మంచి బలమైన జట్టు ఉన్నా కూడా విజయాల వేటలో వెనుకబడుతున్నాడు. ఈ నేపథ్యంలో పంత్‌ ఆటతీరుపై కొందరు మాజీ ఆటగాళ్లు తమ స్పందనలను తెలియజేశారు.

pant3.jpg


మాజీ డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) కూడా పంత్ వరుస వైఫల్యాలపై స్పందించాడు. పంత్ ఒకసారి ధోనీకి ఫోన్ చేసి మాట్లాడాలని సూచించాడు. * పంత్ ఎందుకలా ఆడుతున్నాడో అర్థం చేసుకోగలను. ప్రతి ఆటగాడి కెరీర్లో ఇలాంటి రోజులు ఉంటాయి. ఆ సమయంలో చక్కగా విశ్లేషణ చేసుకోవాలి. ఎక్కడ తప్పు జరుగుతోందో అర్థం చేసుకోవాలి. అవసరమైతే సీనియర్లతో మాట్లాడాలి. పంత్‌కు ధోనీ రోల్ మోడల్. ఒకసారి ధోనీకి కాల్ చేసి మాట్లాడితే పంత్ మనసు తేలికపడుతుంది *అని సెహ్వాగ్ అన్నాడు.

pant2.jpg


ఇక, పంత్ ప్రైస్‌ట్యాగ్ వల్లే ఒత్తిడికి గురవుతున్నాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ (Adam Gilchrist) అభిప్రాయపడ్డాడు. పంత్‌లో స్పార్క్ కనబడడం లేదని అన్నాడు. *పంత్ చాలా ఎంటర్‌టైనింగ్ క్రికెటర్. మైదానంలో ఉత్సాహంగా ఉంటాడు. బ్యాటింగ్ చేసేటపుడు క్రియేటివ్ మైండ్‌సెట్‌తో ఉంటాడు. ఈ సీజన్‌లో పంత్ కాస్తా భిన్నంగా కనిపిస్తున్నాడు. ఒత్తిడిగా, చిరాకుగా కనబడుతున్నాడు. అతడిలో మునుపటి స్పార్క్ లేదు. అతడికి ప్రైస్‌ట్యాగ్ ఒత్తిడి ఉందేమో *అని గిల్‌క్రిస్ట్ వ్యాఖ్యానించాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 05 , 2025 | 06:48 PM