IPL 2025 KKR vs RR: రాణించిన కేకేఆర్ బ్యాటర్లు.. రాజస్తాన్ టార్గెట్ ఎంతంటే
ABN , Publish Date - May 04 , 2025 | 05:13 PM
ఈ రోజు ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ దిగిన కేకేఆర్ బ్యాటర్లు అందరూ సమష్టిగా రాణించారు.
బ్యాటర్లందరూ తమ వంతు పాత్ర పోషించి పరుగులు చేయడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్ ఉంచింది. ఈ రోజు ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ దిగిన కేకేఆర్ బ్యాటర్లు అందరూ సమష్టిగా రాణించారు. అండ్రూ రస్సెల్ (57) హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సునీల్ నరైన్ (11) రెండో ఓవర్లోనే అవుటయ్యాడు. అయితే మరో ఓపెనర్ (35), కెప్టెన్ రహానే (30) చక్కగా రాణించి రెండో వికెట్‌కు 50 పరుగులకు పైగా జోడించాడు. వీరు అవుటైన తర్వాత బరిలోకి దిగిన రస్సెల్ అర్ధశతకం సాధించగా, రఘువంశీ (44) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో రింకూ సింగ్ (19) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది.

రాజస్తాన్ బౌలర్లలో ఆర్చర్, యుధ్వీర్ సింగ్, తీక్షణ, రియాన్ పరాగ్ ఒక్కో వికెట్ తీశారు. రాజస్తాన్ రాయల్స్ ముందు కోల్‌కతా 207 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌ఆర్ గెలవాలంటే బ్యాటర్లందరూ సమష్టిగా రాణించాల్సిందే. ఆర్ఆర్ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు దాదాపు దూరమైన సంగతి తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..