IPL 2025 KKR vs RR: ఒత్తిడిలో చిత్తయిన రాజస్తాన్.. కేకేఆర్ సంచలన విజయం
ABN , Publish Date - May 04 , 2025 | 07:25 PM
రాజస్తాన్ రాయల్స్ జట్టు మరోసారి ఒత్తిడిలో చిత్తయింది. చివరి బంతికి మూడు పరుగులు చేయలేక విజయానికి దూరమైంది. ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ కేవలం ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. రాజస్తాన్ ఇలాంటి టైట్ మ్యాచ్‌లో ఓడిపోవడం ఈ సీజన్‌లో ఇది మూడోసారి.
రాజస్తాన్ రాయల్స్ జట్టు మరోసారి ఒత్తిడిలో చిత్తయింది. చివరి బంతికి మూడు పరుగులు చేయలేక విజయానికి దూరమైంది. ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ కేవలం ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. రాజస్తాన్ ఇలాంటి టైట్ మ్యాచ్‌లో ఓడిపోవడం ఈ సీజన్‌లో ఇది మూడోసారి. రియాన్ పరాగ్ (95) అద్భుత ఇన్నింగ్స్‌తో సత్తా చాటినా రాజస్తాన్‌ను అదృష్టం వెక్కిరించింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయాన్ని అందుకుంది. ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలను మెరగుపరుచుకుంది.

ఈ రోజు ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజంక్య రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటర్లందరూ తమ వంతు పాత్ర పోషించి పరుగులు చేయడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్ ఉంచింది. డ్రూ రస్సెల్ (57) హాఫ్ సెంచరీ చేశాడు. ఓపెనర్ గుర్భాజ్ (35), కెప్టెన్ రహానే (30), రఘువంశీ (44) కీలక ఇన్నింగ్స్ ఆడారు. దీంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో ఆర్చర్, యుధ్వీర్ సింగ్, తీక్షణ, రియాన్ పరాగ్ ఒక్కో వికెట్ తీశారు.
207 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయింది. 71 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో రియాన్ పరాగ్ (95) అద్భుత ఇన్నింగ్స్ ఆడి. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. అతడికి హెట్‌మెయర్ (29) సహకరించాడు. అయితే పరాగ్ అవుటైన తర్వాత కోల్‌కతా పట్టు బిగించింది. అయితే చివర్లో శుభమ్ దూబే (25) కేకేఆర్‌ను భయపెట్టాడు. బౌండరీలతో విరుచుకుపడ్డాడు.
చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సిన దశలో కేవలం సింగిల్ మాత్రమే చేశాడు. దీంతో ఆర్ఆర్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. 20 ఓవర్లలో 205 పరుగులు మాత్రమే చేసింది. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ రెండేసి వికెట్లు తీశారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..