IPL 2025 KKR vs PBKS: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే
ABN , Publish Date - Apr 26 , 2025 | 07:02 PM
ఐపీఎల్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఐదో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టు తలపడుతోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే పంజాబ్ కింగ్స్ నాలుగో స్థానానికి ఎగబాకుతుంది.
ఐపీఎల్ (IPL 2025)లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఐదో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ (PBKS vs KKR) జట్టు తలపడుతోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే పంజాబ్ కింగ్స్ నాలుగో స్థానానికి ఎగబాకుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ బౌలింగ్‌కు రెడీ అవుతోంది.
ఈ సీజన్‌లో పంజాబ్, కోల్‌కతా జట్లు తలపడడం ఇది రెండో సారి. గత మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కేవలం 111 పరుగులు మాత్రమే చేసింది. సునాయాసంగా గెలవాల్సిన కేకేఆర్ అనూహ్యంగా కుప్పకూలి 95 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ చరిత్రలో ఇంత తక్కువ స్కోరును ఛేదించలేక ఓడిపోయిన తొలి జట్టుగా కేకేఆర్ నిలిచింది. ఆ దారుణ పరాజయానికి రివేంజ్ తీర్చుకోవాలని అజింక్య రహానే టీమ్ కృత నిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
తుది జట్లు:
కేకేఆర్: రెహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, మొయిన్ అలీ, రమణ్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా.
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టొయినిస్, మార్కో జాన్సన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..