IPL 2025 KKR vs CSK: ధోనీ ఆడుతున్నాడా.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే
ABN , Publish Date - May 07 , 2025 | 04:58 PM
ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ ఐదు విజయాలతో 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఇక, మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు చేరుకునే వీలుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతోంది.
గతేడాది ఛాంపియన్ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ప్రస్తుత సీజన్‌లో తడబడుతోంది. కేకేఆర్ ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలు కేవలం 15 శాతం మాత్రమే ఉన్నాయి. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ ఐదు విజయాలతో 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఇక, మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ కేకేఆర్ తప్పక గెలవాల్సిందే. అలా గెలిచినా ప్లే ఆఫ్స్‌కు చేరుతుందని కచ్చితంగా చెప్పలేం. ఈ నేపథ్యంలో ఈ రోజు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతోంది (KKR vs CSK).

ప్రస్తుతం రెండు జట్లు ఈడెన్ గార్డెన్స్‌లో సాధన చేస్తున్నాయి. ఈ ప్రాక్టీస్ సెషన్‌కు ధోనీ గైర్హాజరయ్యాడు. స్టేడియంకు ప్రాక్టీస్ కోసం రాలేదు. దీంతో ఈ మ్యాచ్‌లో ధోనీ ఆడడం అనుమానంగా మారింది. అయితే మ్యాచ్‌లో మాత్రం ధోనీ ఆడతాడని సమాచారం. తాజా మ్యాచ్ చెన్నై కంటే కేకేఆర్‌కు అత్యంత కీలకం. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్-2025 నుంచి నిష్క్రమించింది. ప్లే ఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న చెన్నై ఇక ఈ టోర్నీలో నామమాత్రంగానే ఆడుతోంది.
కోల్‌కతా జట్టులో చక్కటి సామర్థ్యం గల బ్యాటర్లు ఉన్నా వారు ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నారు. సునీల్ నరైన్, గుర్భాజ్, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్ పరుగులు చేయడంలో తడబడుతున్నారు. రహానే, రఘువంశీ, రస్సెల్ మాత్రమే పరుగులు చేస్తున్నారు. మరోవైపు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, హర్షిత్ రానా, వైభవ్ అరోరాతో కూడిన బౌలింగ్ విభాగం పటిష్టంగా కనబడుతోంది.
ఇక, సీఎస్కేలో ఒక్క ఆటగాడు కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడడం లేదు. కేవలం ధోనీ క్రేజ్ మీదనే ఆ టీమ్ పయనం సాగిస్తోంది. ఇటీవలి మ్యాచ్‌ల్లో ఆయుష్ మాత్రే, రవీంద్ర జడేజా, సామ్ కర్రన్ పరగులు చేశారు. బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్ విభాగం కాస్తా ఫర్వాలేదనే చెప్పాలి.
తుది జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్ (అంచనా): సునీల్ నరైన్, రహ్మనుల్లా గుర్భాజ్, అజింక్య రహానే, రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్, పావెల్, అనుకూల్ రాయ్, హర్షిత్ రానా, వైభవ్ అరోరా
చెన్నై సూపర్ కింగ్స్ (అంచనా): ఆయుష్ మాత్రే, షేక్ రషీద్, సామ్ కర్రన్, రవీంద్ర జడేజా, బ్రేవిస్, శివమ్ దూబే, దీపక్ హుడా, ధోనీ, పతిరణ, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..