IPL 2025 KKR vs CSK: టాస్ గెలిచిన కోల్‌కతా.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే
ABN , Publish Date - May 07 , 2025 | 06:54 PM
డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ప్రస్తుత సీజన్‌లో మరో కీలక పోరుకు రెడీ అవుతోంది. ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతోంది.
డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ప్రస్తుత సీజన్‌లో మరో కీలక పోరుకు రెడీ అవుతోంది. ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతోంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ ఐదు విజయాలతో 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఇక, మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ కేకేఆర్ తప్పక గెలవాల్సిందే. అలా గెలిచినా ప్లే ఆఫ్స్‌కు చేరుతుందని కచ్చితంగా చెప్పలేం. ఈ నేపథ్యంలో ఈ రోజు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతోంది (KKR vs CSK).
టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో చెన్నై టీమ్ బౌలింగ్‌కు రెడీ అవుతోంది. తాజా మ్యాచ్ చెన్నై కంటే కేకేఆర్‌కు అత్యంత కీలకం. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్-2025 నుంచి నిష్క్రమించింది. ప్లే ఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న చెన్నై ఇక ఈ టోర్నీలో నామమాత్రంగానే ఆడుతోంది.
తుది జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: సునీల్ నరైన్, రహ్మనుల్లా గుర్భాజ్, అజింక్య రహానే, రఘువంశీ, మనీష్ పాండే, రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్, పావెల్, అనుకూల్ రాయ్, హర్షిత్ రానా, వైభవ్ అరోరా
చెన్నై సూపర్ కింగ్స్: ఆయుష్ మాత్రే, డాన్ కాన్వే, ఉర్విల్ పటేల్, రవీంద్ర జడేజా, బ్రేవిస్, శివమ్ దూబే, దీపక్ హుడా, ధోనీ, పతిరణ, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..