IPL 2025, KKR vs CSK: కోల్‌కతా సునాయాస విజయం.. చెన్నైకు వరుసగా ఐదో ఓటమి
ABN , Publish Date - Apr 11 , 2025 | 10:28 PM
తాజా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా ఐదో పరాజయాన్ని మూటగట్టుకుంది. స్వంత మైదానం అయిన చెన్నైలోని చిదంబరం స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

తాజా ఐపీఎల్ (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వరుసగా ఐదో పరాజయాన్ని మూటగట్టుకుంది. స్వంత మైదానం అయిన చెన్నైలోని చిదంబరం స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ (KKR vs CSK) దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో చెన్నై టీమ్ బ్యాటింగ్‌కు దిగింది. కోల్‌కతా స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకున్న చెన్నై కష్టాల్లో పడి స్వల్ప స్కోరుకే పరిమితమైంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకు మూడో ఓవర్లో మొయిన్ అలీ షాకిచ్చాడు. డాన్ కాన్వే (12)ను పెవిలియన్ చేర్చాడు. అప్పట్నుంచి క్రమం తప్పకుండా చెన్నై వికెట్లను కోల్పోతూనే ఉంది. శివమ్ దూబే (31), రాహుల్ త్రిపాఠి (16), విజయ్ శంకర్ (29) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. రచిన్, అశ్విన్, జడేజా, హుడా, ధోనీ, నూర్ అహ్మద్, కాంబోజ్ మాత్రం సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై కోల్‌కతా క్వాలిటీ స్పిన్నర్లు ఎదుర్కోలేక చతికిల పడ్డారు. దీంతో చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు. వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా రెండేసి వికెట్లు పడగొట్టారు. మొయిన్ అలీ, వైభవ్ అరోరా ఒక్కో వికెట్ తీశారు.
104 పరుగలు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా సునాయాసంగా విజయం సాధించింది. ఓపెనర్లు సునీల్ నరైన్ (44), డికాక్ (23) మంచి ఆరంభాన్ని అందించారు. వేగంగా పరుగులు చేశారు. డికాక్‌ను కాంబోజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. డికాక్ అవుట్ అనంతరం క్రీజులోకి వచ్చిన రహానే (20 నాటౌట్) అచితూచి ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చాడు. చెన్నై నిర్దేశించిన లక్ష్యాన్ని కేవలం 10.1 ఓవర్లలోనే కేకేఆర్ ఛేదించింది. దీంతో చెన్నై టీమ్ ఈ సీజన్‌లో వరుసగా ఐదో ఓటమిని మూటగట్టుకుంది. పాయింట్ల పట్టికల్లో అట్టడుగు స్థానానికే పరిమితమైంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..