Share News

IPL 2025 KKR vs CSK: ఎట్టకేలకు గెలిచిన చెన్నై.. కీలక మ్యాచ్‌లో కోల్‌కతా ఓటమి

ABN , Publish Date - May 07 , 2025 | 11:13 PM

ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓటమి పాలైంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు ఒక విజయం సాధించింది. రెండు వికెట్ల తేడాతో కేకేఆర్‌పై గెలుపొందింది. నాలుగు పరాజయాల తర్వాత చెన్నైకు ఇది తొలి గెలుపు.

IPL 2025 KKR vs CSK: ఎట్టకేలకు గెలిచిన చెన్నై.. కీలక మ్యాచ్‌లో కోల్‌కతా ఓటమి
CSK Won by 4 wickets against KKR

ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఓటమి పాలైంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు ఒక విజయం సాధించింది. రెండు వికెట్ల తేడాతో కేకేఆర్‌పై గెలుపొందింది. నాలుగు పరాజయాల తర్వాత చెన్నైకు ఇది తొలి గెలుపు. 12 మ్యాచ్‌ల్లో ఇది మూడో విజయం. ఈ పరాజయంతో కోల్‌కతా ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి (KKR vs CSK).

CSK.jpg


టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడతూ కోల్‌కతా బ్యాటర్లు సమష్టిగా రాణించారు. కెప్టెన్ అజింక్య రహానే (48) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మనీష్ పాండే (36 నాటౌట్), ఆండ్రూ రస్సెల్ (38), సునీల్ నరైన్ (26) కూడా కీలక పరుగులు చేశారు. దీంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ మరోసారి సత్తా చాటాడు. ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా, అన్షుల్ కాంబోజ్ ఒక్కో వికెట్ తీశారు.

CSK2.jpg


కోల్‌కతా నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకు మంచి ఆరంభం లభించలేదు. గత మ్యాచ్ హీరో ఆయుష్ మాత్రే రెండో బంతికే అవుటయ్యాడు. ఆ తర్వాత కాన్వే (0), అశ్విన్ (8), రవీంద్ర జడేజా (19) కూడా త్వరగానే అవుటయ్యారు. 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన చెన్నైను బ్రేవిస్ (52), శివమ్ దూబే (45) ఆదుకున్నారు. ఉర్విల్ పటేల్ (31) కూడా కీలక పరుగులు చేశాడు. చివర్లో ధోనీ (17) మరోసారి తన మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో చెన్నై 19.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 07 , 2025 | 11:15 PM