Share News

IPL 2025 KKR vs CSK: రాణించిన కోల్‌కతా బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే

ABN , Publish Date - May 07 , 2025 | 09:09 PM

ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బ్యాటర్లు సత్తా చాటారు. సమష్టిగా రాణించి భారీ స్కోరు చేశారు. ఈ రోజు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి

IPL 2025 KKR vs CSK: రాణించిన కోల్‌కతా బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే
Noor Ahmad

ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బ్యాటర్లు సత్తా చాటారు. సమష్టిగా రాణించి భారీ స్కోరు చేశారు. ఈ రోజు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి (KKR vs CSK). బ్యాటర్లు అందరూ సమష్టిగా రాణించడంతో కోల్‌కతా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. చెన్నై ముందు 180 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.

kkr.jpg


టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడతూ కోల్‌కతా బ్యాటర్లు సమష్టిగా రాణించారు. కెప్టెన్ అజింక్య రహానే (48) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మనీష్ పాండే (36 నాటౌట్), ఆండ్రూ రస్సెల్ (38), సునీల్ నరైన్ (26) కూడా కీలక పరుగులు చేశారు. దీంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ మరోసారి సత్తా చాటాడు. ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.


రవీంద్ర జడేజా, అన్షుల్ కాంబోజ్ ఒక్కో వికెట్ తీశారు. మరి కోల్‌కతా నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని చెన్నై బ్యాటర్లు ఎలా ఛేదిస్తారో చూడాలి. ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైతే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చూసుకుంటుంది. మరి, ఈ టార్గెట్‌ను కోల్‌కాతా బౌలర్లు ఎలా డిఫెండ్ చేసుకుంటారో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 07 , 2025 | 09:10 PM