Share News

IPL 2025: ఆర్సీబీకి బ్యాడ్ లక్.. టైటిల్ రేసులో ఉన్న బెంగళూరుకు ఏం జరుగుతోంది

ABN , Publish Date - May 13 , 2025 | 06:55 PM

ఇప్పటివరకు ఐపీఎల్‌లో పెద్దగా రాణించలేకపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఈ ఏడాది సీజన్‌లో మాత్రం అద్భుతంగా ఆడుతోంది. రజత్ పటిదార్ సారథ్యంలోని ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్‌లో టైటిల్ ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా నిలిచింది.

IPL 2025: ఆర్సీబీకి బ్యాడ్ లక్.. టైటిల్ రేసులో ఉన్న బెంగళూరుకు ఏం జరుగుతోంది
RCB Team

ఇప్పటివరకు ఐపీఎల్‌లో (IPL 2025) పెద్దగా రాణించలేకపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ ఈ ఏడాది సీజన్‌లో మాత్రం అద్భుతంగా ఆడుతోంది. రజత్ పటిదార్ సారథ్యంలోని ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్‌లో టైటిల్ ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా నిలిచింది. అయితే ఆ జట్టును దురదృష్టం వెంటాడుతోంది. ఆ జట్టు వరుస విజయాలు సాధిస్తున్న దశలో భారత్-పాక్ ఉద్రిక్తతల కారణంగా టోర్నీ వాయిదా పడింది.


టోర్నమెంట్ త్వరలో తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కానీ ఇంతలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ జట్టు కెప్టెన్ రజత్ పటిదార్ చేతి వేలి గాయం కారణంగా ఇబ్బందిపడుతున్నాడు. అతడు మరో మూడు, నాలుగు మ్యాచ్‌లు ఆడే అవకాశం కనిపించడం లేదు. దీంతో జితేష్ శర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగించబోతున్నారు. ఇక, ఆ జట్టు స్టార్ బౌలర్ అయిన జాష్ హాజెల్‌వుడ్ కూడా తిరిగి ఆర్సీబీ తరఫున మైదానంలో దిగే అవకాశాలు లేవు.


ఆస్ట్రేలియాకు చెందిన హాజెల్‌వుడ్ జూన్ 11వ తేదీన దక్షిణాఫ్రికాతో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆడాల్సి ఉంది. హాజెల్‌వుడ్ ఆస్ట్రేలియాకు కీలక బౌలర్ అనే సంగతి తెలిసిందే. దీంతో అతడు ఆర్సీబీ ఆడే మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశం కనిపించడం లేదు. అతడు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనాల్సిన అవకాశం ఉంది. పటిదార్, హాజెల్‌వుడ్ ఆర్సీబీకి కీలక ఆటగాళ్లు అనే సంగతి తెలిసిందే. వీరిద్దరూ దూరమైతే జట్టుపై తీవ్ర ప్రభావం పడడం మాత్రం ఖాయం.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 13 , 2025 | 06:55 PM