Share News

Harry Brook: ఐపీఎల్ నుంచి బయటకు రావాలనుకోవడం సరైన నిర్ణయమే.. నిషేధంపై హ్యారీ బ్రూక్ రియాక్షన్

ABN , Publish Date - Apr 11 , 2025 | 05:01 PM

ఐపీఎల్ నుంచి నిషేధం ఎదుర్కొన్న తొలి క్రికెటర్ హ్యారీ బ్రూక్. గతేడాది జరిగిన మేగా వేలంలో హ్యారీ బ్రూక్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ.6.5 కోట్లకు దక్కించుకుంది. అయితే వేలం తర్వాత ఈ సీజన్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని బ్రూక్ నిర్ణయించుకున్నాడు. దీంతో ఐపీఎల్ నిబంధనల ప్రకారం బ్రూక్‌పై రెండేళ్ల పాటు నిషేధం విధించింది.

Harry Brook: ఐపీఎల్ నుంచి బయటకు రావాలనుకోవడం సరైన నిర్ణయమే.. నిషేధంపై హ్యారీ బ్రూక్ రియాక్షన్
Harry Brook

ఇంగ్లండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్‌ (Harry Brook)పై నిషేధం విధిస్తూ ఐపీఎల్ (IPL 2025) తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఐపీఎల్ నుంచి నిషేధం ఎదుర్కొన్న తొలి క్రికెటర్ హ్యారీ బ్రూక్ కావడం గమనార్హం. గతేడాది జరిగిన మేగా వేలంలో హ్యారీ బ్రూక్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టు రూ.6.5 కోట్లకు దక్కించుకుంది. అయితే వేలం తర్వాత ఈ సీజన్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని బ్రూక్ నిర్ణయించుకున్నాడు. దీంతో ఐపీఎల్ నిబంధనల ప్రకారం బ్రూక్‌పై రెండేళ్ల పాటు నిషేధం విధించింది.


ఈ నిషేధంపై పలువురు మాజీ క్రికెటర్లు స్పందించారు. అయితే బ్రూక్ నుంచి మాత్రం స్పందన రాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బ్రూక్ తన నిషేధం గురించి మాట్లాడాడు. ఐపీఎల్‌లో అలాంటి రూల్ ఉందని నాకు తెలియదు. అయితే నా నిషేధం న్యాయంగానే జరిగిందని అనుకుంటున్నా. ఈ నిర్ణయం వల్ల చాలా ఆదాయం కోల్పోవాల్సి ఉంటుంది. అయితే నా మొదటి ప్రాధాన్యం ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే. ఇంగ్లండ్ టీమ్‌కు ఆడేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను అని బ్రూక్ అన్నాడు.


అలాగే ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడడంపై తనకు పెద్దగా ఆసక్తి లేదని, భవిష్యత్తులో ఆడేది అనుమానేనని చెప్పాడు. ఐపీఎల్ నుంచి బయటకు రావాలనుకోవడం నా వరకు సరైన నిర్ణయమే అని భావిస్తున్నా. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తేలికైన నిర్ణయం కాదు. ఏడాదిన్నర కాలంగా చాలా క్రికెట్ ఆడుతున్నా. నా వర్క్‌లోడ్‌ను మేనేజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తా. భవిష్యత్తులో కూడా నేను ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడడం అనుమానమే అని హ్యారీ బ్రూక్ పేర్కొన్నాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 11 , 2025 | 05:01 PM