Share News

IPL 2025: ప్రాక్టీస్ ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్.. బట్లర్ ఇంటికి వెళ్లిపోయాడా

ABN , Publish Date - May 12 , 2025 | 07:16 AM

కాల్పుల విరమణ అంగీకారంతో ఐపీఎల్‌కు మార్గం సుగమమైంది. ఇంకా 16 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ను ఈ నెల 16న లేదా 17న ప్రారంభించడానికి బీసీసీఐ ప్రయత్నిస్తోంది.

IPL 2025: ప్రాక్టీస్ ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్.. బట్లర్ ఇంటికి వెళ్లిపోయాడా
Shubhman Gill

పాక్‌ దాడుల కారణంగా గత గురువారం ధర్మశాలలో పంజాబ్‌-ఢిల్లీ మ్యాచ్‌ అర్ధంతరంగా ఆగిన విషయం తెలిసిందే. మరుసటి రోజే ఐపీఎల్‌ను (IPL 2025) వారం పాటు వాయిదా వేస్తున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. అయితే కాల్పుల విరమణ అంగీకారంతో ఐపీఎల్‌కు మార్గం సుగమమైంది. ఇంకా 16 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ను ఈ నెల 16న లేదా 17న ప్రారంభించడానికి బీసీసీఐ (BCCI) ప్రయత్నిస్తోంది.


బీసీసీఐ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రాక్టీస్ ప్రారంభించింది. గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జీటీ ఆటగాళ్లు ప్రాక్టీస్ ప్రారంభించారు. గుజరాత్‌కు చెందిన విదేశీ ఆటగాళ్లైన జాస్ బట్లర్, గెరాల్డ్ కోయెట్జీ ఇప్పటికే స్వదేశానికి వెళ్లిపోయినట్టు సమాచారం. అయితే టోర్నీ తిరిగి ఆరంభమయ్యే సమయానికి వాళ్లు జట్టుతో పాటు కలవబోతున్నట్టు తెలుస్తోంది. గుజరాత్ టీమ్‌కు జాస్ బట్లర్ ఎంతటి కీలక ఆటగాడో తెలిసిందే.


అలాగే పలు ఫ్రాంఛైజీలకు చెందిన విదేశీ ఆటగాళ్లు కూడా ఇప్పటికే తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. వారందరినీ తిరిగి రప్పించేందుకు ఫ్రాంఛైజీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు మాత్రం ఆ జట్టు హెడ్ కోచ్ పాంటింగ్ సూచనల మేరకు భారత్‌లోనే ఉండిపోయారు. మే 16న లేదా 17న లఖ్‌నవూలో లఖ్‌నవూ-బెంగళూరు మ్యాచ్‌తో ఐపీఎల్-2025 తిరిగి ప్రారంభం కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 12 , 2025 | 07:16 AM