IPL 2025, GT vs RR: గుజరాత్ జైత్రయాత్ర.. రాజస్తాన్‌పై గెలుపు
ABN , Publish Date - Apr 09 , 2025 | 11:30 PM
ఐపీఎల్‌లో గుజరాత్ టీమ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. గత రెండు మ్యాచ్‌ల్లో గెలిచి జోరుమీదున్న రాజస్తాన్ ఈ మ్యాచ్‌లో పరాజయం పాలైంది. భారీ స్కోరు ఛేదనలో తడబడింది. 58 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఐపీఎల్ (IPL 2025)లో గుజరాత్ టీమ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. గత రెండు మ్యాచ్‌ల్లో గెలిచి జోరుమీదున్న రాజస్తాన్ ఈ మ్యాచ్‌లో పరాజయం పాలైంది. భారీ స్కోరు ఛేదనలో తడబడింది. 58 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గుజరాత్‌లోని నరేంద్ర మోదీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (Sai Sudarshan) 82 పరుగులు చేశాడు.
గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 2 పరుగులకే అవుటైనా మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (53 బంతుల్లో 3 సిక్స్‌లు, 8 ఫోర్లతో 82) మాత్రం తన ఫామ్‌ను కొనసాగించాడు. సిక్స్‌లు, ఫోర్లతో హోరెత్తించాడు. సెంచరీ చేస్తాడనుకునే సమయంలో తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో అవుటై వెనుదిరిగాడు. గుజరాత్ భారీ స్కోరులో కీలక పాత్ర పోషించాడు. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, తీక్షణ రెండేసి వికెట్లు తీశారు. సందీప్ శర్మ ఒక వికెట్ తీశాడు
218 పరుగుల భారీ లక్ష్యంతో దిగిన రాజస్తాన్‌కు ఆరంభంలో ఎదురు దెబ్బ తగిలింది. 12 పరుగులకే యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్ వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో సంజూ శాంసన్ (41), రియాన్ పరాగ్ (26) ఆదుకున్నారు. కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. పరాగ్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హెట్‌మెయర్ (52) అర్ధశతకం సాధించాడు. అయితే అతడికి ఇతర బ్యాటర్ల నుంచి సహకారం కొరవడింది. దీంతో రాజస్తాన్ 19.2 ఓవరలో 159 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్, సాయి కిషోర్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. సిరాజ్, అర్షద్ ఖాన్, ఖెజ్రోలియా ఒక్కో వికెట్ తీశారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..