IPL 2025 DC vs SRH: టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే
ABN , Publish Date - May 05 , 2025 | 07:04 PM
ప్లేఆఫ్స్ రేసులో ముందుకెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడుతోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్‌కు వేదిక కాబోతోంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో నాలుగింట గెలుపొందిన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.
ఐపీఎల్‌లో (IPL 2025) మరో కీలక పోరుకు తెరలేపింది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడుతోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్‌కు వేదిక కాబోతోంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో నాలుగింట గెలుపొందిన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లే ఆఫ్స్ ఫైట్‌లో ముందుకు వెళ్లగలుగుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ ఢిల్లీకి అత్యంత కీలకమైన మ్యాచ్ అని చెప్పాల్సిందే.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ బ్యాటింగ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపు కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్‌లో కూడా ఓడితే ఇక టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించినట్టే. ఇప్పటివరకు పది మ్యాచ్‌లు ఆడిన ప్యాట్ కమిన్స్ టీమ్ కేవలం మూడింట్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఈ రోజు మ్యాచ్‌లో గెలిస్తే హైదరాబాద్ టీమ్ సాంకేతికంగా ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది.
తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, ఉనద్కత్, మహ్మద్ షమీ
ఢిల్లీ క్యాపిటల్స్: అభిషేక్ పోరెల్, డుప్లెసిస్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ఛమీరా, ముఖేష్ కుమార్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..