Share News

IPL 2025 DC vs SRH: ఢిల్లీ క్యాపిటల్స్‌కు పరీక్ష.. ఉప్పల్‌లో సన్‌రైజర్స్ ‌తో కీలక పోరు

ABN , Publish Date - May 05 , 2025 | 05:21 PM

వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ రోజు కీలక పోరుకు రెడీ అవుతోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లే ఆఫ్స్ ఫైట్‌లో ముందుకు వెళ్లగలుగుతుంది.

IPL 2025 DC vs SRH: ఢిల్లీ క్యాపిటల్స్‌కు పరీక్ష.. ఉప్పల్‌లో సన్‌రైజర్స్ ‌తో కీలక పోరు
SRH vs DC

టోర్నీ (IPL 2025) ఆరంభంలో వరుస విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టు ఆ తర్వాత తడబడింది. పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానంలో ఉన్న జట్టు కాస్తా ప్లే ఆఫ్స్ కోసం ఫైట్ చేయాల్సిన పరిస్థితిలోకి వచ్చింది. వరుస పరాజయాలతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కీలక పోరుకు రెడీ అవుతోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడుతోంది (DC vs SRH). ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లే ఆఫ్స్ ఫైట్‌లో ముందుకు వెళ్లగలుగుతుంది.

srh3.jpg


మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కూడా ఇది కీలకమైన మ్యాచ్ అని చెప్పాల్సిందే. ఇప్పటికే ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకున్న హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో కూడా ఓడితే ఇక టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించినట్టే. ఇప్పటివరకు పది మ్యాచ్‌లు ఆడిన ప్యాట్ కమిన్స్ టీమ్ కేవలం మూడింట్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు స్వంత మైదానంలో ఢిల్లీతో పోటీపడబోతోంది.


ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటివరకు 25 సార్లు తలపడ్డాయి. అందులో 13 సార్లు హైదరాబాద్ టీమ్ విజయాలు సాధించింది. 12 సార్లు ఢిల్లీ టీమ్ గెలుపొందింది. హైదరాబాద్ పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు ముందు బౌలింగ్ చేయడం మంచిది. హైదరాబాద్‌లో వాతావరణం పొడిగా ఉంటుంది. మ్యాచ్ సమయంలో వర్షం పడే సూచనలు కనిపించడం లేదు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 05 , 2025 | 05:24 PM