IPL 2025 DC vs RCB: కోహ్లీ ప్రతీకారం తీర్చుకుంటాడా.. రాహుల్ ఫీట్ రిపీట్ చేస్తాడా
ABN , Publish Date - Apr 27 , 2025 | 05:13 PM
ఈ రోజు ఈ రెండు జట్లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో తలపడుతున్నాడు. ఢిల్లీ విరాట్ కోహ్లీ సొంత నగరం. మరి, రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఆడుతున్న కోహ్లీ ఢిల్లీలో చెలరేగి తన జట్టుకు రాహుల్ తరహాలో మరపురాని విజయాన్ని అందిస్తాడా?
ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (DC vs RCB) మధ్య జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (KL Rahul) విశ్వరూపం చూపించాడు. ఆ మ్యాచ్‌లో తన జట్టును గెలిపించిన అనంతరం మైదానంలో కాంతారా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అది తన అడ్డా అని చాటి చెప్పాడు. బెంగళూరు కేఎల్ రాహుల్‌కు సొంత నగరం. ఇక, ఈ రోజు ఈ రెండు జట్లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో తలపడుతున్నాయి. ఢిల్లీ విరాట్ కోహ్లీ (Virat Kohli) సొంత నగరం. మరి, రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఆడుతున్న కోహ్లీ ఢిల్లీలో చెలరేగి తన జట్టుకు రాహుల్ తరహాలో మరపురాని విజయాన్ని అందిస్తాడా?
ఐపీఎల్ (IPL 2025)లో మరో సూపర్ ఫైట్‌కు రంగం సిద్ధమవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఈ రోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో తలపడబోతున్నాయి (DC vs RCB). ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవడమే కాదు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కూడా దూసుకెళ్తుంది. ఇక, ఐపీఎల్ చరిత్రలో డీసీ, ఆర్సీబీ జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్‌లు ఆడాయి. వీటిల్లో ఆర్సీబీ 18 సార్లు, ఢిల్లీ 12 సార్లు విజయాలు సాధించాయి. ఒక మ్యాచ్ రద్దు కాగా, మరొకటి టై అయింది.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అలాగే పిచ్ కాస్తా డ్రైగా ఉంటుంది కాబట్టి స్పిన్నర్లకు కూడా మద్దతు లభిస్తుంది. ఐపీఎల్‌లో డీసీ, ఆర్సీబీ ప్రస్థానం దాదాపు ఒకేలా సాగుతోంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ సాధించలేదు. అయితే ఈ సీజన్‌లో మాత్రం ఈ జట్లు పూర్తి భిన్నమైన ఆటతీరును ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నాయి. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో రాణిస్తూ టాప్ జట్లుగా కొనసాగుతున్నాయి. మరి, ఈ రోజు జరగబోయే మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..